Search
Friday 16 November 2018
  • :
  • :

ఎలిమినేటర్‌కు వర్షం అడ్డంకి ..

rain-in-matchబెంగళూరు: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం వెంటాడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. తర్వాత భారీ వర్షం రావడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు. అర్ధ పడుతూనే ఉంది. దీంతో ఇంకా ఓవర్ కూడా సాధ్యం అయ్యేలా లేదు. ఒక వేళ మ్యాచ్ రద్దయితే లీగ్‌లో మెరుగ్గా ఆడిన హైదరాబాద్ క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది.
తడబడ్డారు..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ ప్రారంభం నుంచే తడబడింది. కోల్‌కతా బౌలర్లు తొలి ఓవర్ నుంచే పొదుపుగా బౌలింగ్ చేశారు. దీంతో సన్‌రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్‌లు ధాటిగా పరుగులు సాధించలేక పోయారు. పిచ్ కూడా బ్యాటింగ్‌కు కష్టంగా తయారైంది. స్కోరు బోర్డు నెమ్మదిగా సాగింది. ఇదే సమయంలో ఉమేశ్ యాదవ్ చక్కటి బంతితో ధావన్ (11)ను వెనక్కి పంపాడు. అప్పటికి జట్టు స్కోరు 25 పరుగులే. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన విలియమ్‌సన్ కూడా తడబడ్డాడు. వేగంగా ఆడడంలో విఫలమయ్యాడు. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రైజర్స్ పవర్ ప్లే ముగిసే సమయానికి ౩౦ పరుగులు మాత్రమే చేసింది. జట్టును ఆదుకుంటాడని భావించిన విలియమ్‌సన్ రెండు ఫోర్లు, సిక్స్‌తో 24 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ వికెట్ కౌల్టర్ నైల్ ఖాతాలోకి వెళ్లింది. తర్వాతి ఓవర్‌లోనే కెప్టెన్ వార్నర్ కూడా వెనుదిరిగాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37 పరుగులు చేసిన వార్నర్‌ను పియూష్ చావ్లా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో వార్నర్ ఐపిఎల్‌లో 4వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. వార్నర్ ఔటైన తర్వాత హైదరాబాద్ కష్టాలు మరింత పెరిగాయి. భారీ ఆశలు పెట్టుకున్న సీనియర్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ (9) నిరాశ పరిచాడు. మరోవైపు కాస్త దూకుడుగా ఆడిన విజయ్ శంకర్ 17 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. వికెట్ కీపర్ నమాన్ ఓజా ఒక సిక్సర్‌తో 16 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ స్కోరు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 128 పరుగులకు చేరింది. కోల్‌కతా బౌలర్లలో కౌల్టర్ నైల్ 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నరైన్ కూడా పొదుపుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు.

స్కోరుబోర్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (బి) పియూష్ చావ్లా 37, శిఖర్ ధావన్ (సి) ఉతప్ప (బ) ఉమేశ్ యాదవ్ 11, కానె విలియమ్‌సన్ (సి) సూర్యకుమార్ (బి) కౌల్టర్ నైల్ 24, యువరాజ్ సింగ్ (సి) చావ్లా (బి) ఉమేశ్ యాదవ్ 9, విజయ్ శంకర్ (సి) సూర్యకుమార్ (బి) కౌల్టర్ నైల్ 22, నమాన్ ఓజా (సి) క్రిస్ లిన్ (బి) బౌల్ట్ 16, జోర్డాన్ (సి) అండ్ (బి) కౌల్టర్ నైల్ ౦, బిపుల్ శర్మ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం 20 ఓవర్లలో 128/7.
బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 4-0-21-2, బౌల్ట్ 4-0-30-1, సునీల్ నరైన్ 4-0-20-0, యూసుఫ్ పఠాన్ 1-0-7-0, కౌల్టర్ నైల్ 4-0-20-3, పియూష్ చావ్లా 3-0-27-1.

Comments

comments