Home సినిమా మార్షల్ ఆర్ట్ నేపథ్యంలో…

మార్షల్ ఆర్ట్ నేపథ్యంలో…

శివ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘సూపర్ పవర్’. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సారిపల్లి కొండలరావు మూహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వగా… తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ “గతంలో నేను ‘పోలీస్ పవర్’ చిత్రంలో హీరోగా నటించాను. ఆ సినిమా మాస్ హీరోగా నిలబడటానికి తోడ్పడింది. అదే స్ఫూర్తితో మా బ్యానర్‌లో ‘మాస్ పవర్’ చిత్రాన్ని నిర్మించాను. ఇందులో ఐదు ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాను జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ‘సూపర్ పవర్’ చిత్రాన్ని ప్రారంభించాం. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడతాం. మార్షల్ ఆర్ట్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది”అని అన్నారు. వి.సాగర్ మాట్లాడుతూ “శివ మంచి టెక్నీషియన్. అతని చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ శివ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. అలాగే ‘మాస్ పవర్’ చిత్రంలోని ఫైట్స్, ట్రైలర్‌ను ప్రదర్శించారు.

Super Power Movie Based on Martial Arts

Telangana News