Home జాతీయ వార్తలు జగన్ పాదయాత్రకు సూపర్ రెస్పాన్స్

జగన్ పాదయాత్రకు సూపర్ రెస్పాన్స్

Jagan-walk

అనంతపురం : వైసిపి చీఫ్ జగన్ ప్రజా సంకల్పం పేరిట చేపట్టిన పాదయాత్ర ఆదివారంతో 43వ రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లాలో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఆయన తన పాదయాత్రను కదిరి నుంచి ప్రారంభించారు. కటారుపల్లిలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. జగన్ పాదయాత్ర ఆరు వందల కిలోమీటర్ల మైలు రాయి చేరుకోవడంతో కటారుపల్లిలో మొక్కను నాటారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. డిఇడి అభ్యర్థులు జగన్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రజా సమస్యలు వింటూ, టిడిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జగన్ ముందుకు సాగుతున్నారు.

Super Response to Jagan Padayatra