Home తాజా వార్తలు అప్పుడే గ్రీన్ సిగ్నల్

అప్పుడే గ్రీన్ సిగ్నల్

Mahesh Babu heaps praises on Geetha Govindamబ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘భరత్ అనే నేను’ తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు చేస్తున్న చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఉగాది పండుగ కానుకగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే మహేష్ తన నెక్స్ సినిమాల కోసం చర్చలు జరుపుతున్నారు. ఇటీవల ‘రంగస్థలం’తో పెద్ద హిట్‌ను అందుకున్న దర్శకుడు సుకుమార్ చాలా రోజుల నుండి మహేష్‌తో సినిమా కోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదు. గతంలో మహేష్‌బాబు బౌండ్ స్క్రిప్ట్ లేకున్నా సినిమా చేయడానికి ముందుకు వచ్చేవారు కానీ ఇప్పుడు ఈ విషయంలో ఏమాత్రం రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరట. బౌండ్ స్క్రిప్ట్‌తో మహేష్‌ను మెప్పిస్తే కానీ సుకుమార్ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదని అంటున్నారు. ఇక సుకుమార్‌తో పాటు మరో యువ దర్శకుడితో సినిమా చేసేందుకు ఈ సూపర్‌స్టార్ ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే కథలు వింటున్నారట. ఎవరితో సినిమా అయినా కంటెంట్‌తో మెప్పించి… బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తేనే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారట. బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు నిరాశపరచడంతో కొత్త సినిమాల విషయంలో ఈ సూపర్‌స్టార్ ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారట.

Super Star Mahesh Babu New Movie Announcement