Home గాసిప్స్ 2017 లో ముఖ్యమంత్రిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు..?

2017 లో ముఖ్యమంత్రిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు..?

Super Star Mahesh Babu as Chief Minister in Bharat Ane Nenu with Koratala Shiva

ఇదివరకే మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడంటూ గాసిప్పుల మీద గాసిప్పులు వచ్చాయి. అయితే, ఆ గాసిప్పులను బ్రేక్ చేస్తూ ఇప్పుడు ఇంకో గాసిప్పు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నది.

మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా డివివి దానయ్య నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను అనే మూవీ రాబోతున్నదట. దానయ్య సోమవారమే మూవీ టైటిల్ ను రిజిస్టర్ చేయించాడట. ప్రస్తుతం మహేశ్ ఎఆర్ మురగదాస్ మూవీ లో నటిస్తున్నాడు. అది వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తవుతుందట.

అది పూర్తి కాగానే కొరటాల శివ మూవీ పట్టాలకెక్కనుందట. ఇక, ఈ మూవీని వచ్చే దసరకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నదట మూవీ యూనిట్. అయితే, ఈ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నప్పటికీ… ఇంతవరకు మూవీ యూనిట్ నుంచి పక్కా కన్ఫర్మేషన్ అయితే లేదు.

ఏది ఏమయితేనేం… మన దేశంలో చాలా మంది ఫిలిం యాక్టర్లు రియల్ లైఫ్ లో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇక, మహేశ్ రీల్ లైఫ్ లో ముఖ్యమంత్రిగా ఎలా నటిస్తాడోనని మహేశ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారట.