Home ఆఫ్ బీట్ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం..

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం..

Superfood to Boost Immunity During Cold

చలికాలం మొదలయ్యింది… వాతావరణంలో మార్పులు వస్తుంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని, పానీయాలను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ముక్కు కారడం, జలుబు వంటి సమస్యలు పీడిస్తాయి. వాటికి విరుగుడుగా మందులు వేసుకోవడం కన్నా సహజసిద్ధమైన పానీయాలతోనే ఉపశమం పొందవచ్చంటున్నారు ప్రముఖ నూట్రిషనిస్టులు. వారు చెబుతున్న కొన్నిజాగ్రత్తలు, సూచిస్తున్న
పానీయాలివి…

ఈ సమయంలో శరీరంలోని మంచి, చెడు బ్యాక్టీరియాల బ్యాలెన్స్‌లో మార్పులు వస్తాయి. ఈ మార్పు రోగనిరోధకశక్తిపై ప్రభావం చూపుతుంది. బ్యాలెన్స్‌ను సాధించాలంటే ప్రోబయోటిక్స్ అవసరమవుతాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ అలెర్జిక్ గుణాలుంటాయి. యోగర్ట్‌లో ఇవి ఎక్కువగా ఉంటాయి.

ముక్కు దిబ్బడను పోగొట్టేందుకు అల్లం, వెల్లుల్లి, మిరియాల వంటివి బాగా పనిచేస్తాయి. వీటిలోని క్యాప్స్‌న్ కాంపౌండ్ సైనస్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

చలికాలంలో చర్మ సంబంధ అలెర్జీలు కూడా పెరుగుతాయి. ఈ లక్షణాలను ఎదుర్కోవాలంటే శరీరానికి విటమిన్ సి తప్పనిసరి. కమలాఫలాలు, స్ట్రాబెర్రీ, క్యాబేజీల్లో విటమిన్ సి అధికంగా లభిస్తుంది.
ఈ సీజన్‌లో ఊపిరితిత్తులు బాగుండాలంటే మెగ్నీషియం తప్పనిసరి. పాలకూర, జీడిపప్పు, చిక్కుళ్లలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది.

రోగనిరోధకశక్తిని పెంచే పానీయాలివే…
పసుపుతో ఇమ్యునిటీ బూస్టర్ అరకప్పు కొబ్బరినీళ్లు, 5 స్పూన్ల పసుపు, 10 నుంచి 15 గ్రాముల అల్లం తీసుకుని బ్లెండర్‌లో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి, తర్వాత ఒక టీ స్పూను నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, తేనె కలిపాలి. ఈ పసుపు బూస్టర్‌లో గుప్పెడు నానబెట్టిన నట్స్ (ఆల్మండ్స్, వాల్‌నట్స్, జీడిపప్పు ఏదైనా ఒకటే) వేసి తాగాలి. ఈ జ్యూస్ తాగితే అర్థరైటీస్, ఆస్తమా, ఎగ్జిమా నుంచి తప్పించుకోవచ్చు. అంతేగాక పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తాయి.

కీరదోస, పైనాపిల్ జ్యూస్
ఒక కీరదోసకాయ, పైనాపిల్ ముక్కలు రెండు, ఆపిల్ ముక్కలు మూడు, రెండు మూడు పుదీనా ఆకులు, రెండు స్పూన్ల నిమ్మరసం తీసుకుని బాగా బ్లెండ్ చేయాలి. తర్వాత చిటికెడు రాతి ఉప్పును కలిపి (రుచి కోసం తేనె కూడా కలపొచ్చు) మరోసారి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా నీళ్లుగానీ లేదా ఐసు ముక్కలుగానీ కలిపి తాగితే శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. ఈ జ్యూస్ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది కూడా.

కఢాటీ
50 గ్రాముల అల్లం, 50 గ్రాముల పసుపు, 3 గ్రాముల యాలకులు, మూడు తులసి ఆకులను బ్లెండ్ చేసి దీన్ని ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లలో కలిపి వేడి చేయాలి. బాగా మరుగుతున్నప్పుడే ఐదు గ్రాముల దాల్చినచెక్క పొడి, ఐదు గ్రాముల మేస్ పౌడర్ వేసి ఇంకో ఐదు నిమిషాలు మరిగించి వడపోయాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా తేనె కలపితే కûఢా టీ తయారవుతుంది. ఈ భారతీయ సంప్రదాయ పానీయం తాగితే దగ్గు, జలుబు, గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Superfood to Boost Immunity During Cold

Telangana Latest News