Home జిల్లాలు కృష్ణా పుష్కరాలకు పటిష్ట బందోబస్తు

కృష్ణా పుష్కరాలకు పటిష్ట బందోబస్తు

policeమహబూబ్‌నగర్ ప్రతినిధి: జిల్లాలో కృష్ణా పరివాహన ప్రాంతాల్లో త్వరలో జరగబోయే కృష్ణా పుష్కరాలకు పటిష్ట బందోబస్తు ఏ ర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రెమా రాజేశ్వరీ అన్నారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సోమవారం ఎస్పీ తన చాంబర్‌లో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పుష్కరఘాట్లు, భక్తుల సౌకర్యం, ట్రాఫిక్ సమస్య, పోలీస్ విధులపై సమీక్ష నిర్వహించారు. ప్రణాళికా బద్దంగా పని చేయడం వల్ల బందోబస్తు నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. తద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలో కృష్ణానది పరివాహక ప్రాంతం పాలమూరు జిల్లాలో అధికంగా ఉండడం వల్ల పోలీసులపై గురుతర బాధ్యత ఎక్కవగా ఉంటుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యను సవాల్‌గా స్వీకరించాలన్నారు. పుష్కరఘాట్లకు వచ్చే భక్తులకు నిర్ధేశించిన ప్రాంతాల్లోనే వారి వాహనాలను పార్కింగ్ ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతిక్షణం జా గత్తగా ఉండాలన్నారు. వివిధ శాఖల అధికారులతో పోలీసులు సమన్వయంతో ఉండాలన్నారు. సమావేవంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ కల్మేశ్వర్ సింగనవార్, డీఎస్పీలు చెన్నయ్య, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, పీఆర్‌ఓ రంగినేని మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.