Home జోగులాంబ గద్వాల్ ఒకే ఒక్కడు..

ఒకే ఒక్కడు..

జోగుళాంబ జిల్ల్లా నేరగాళ్లపై ఎస్‌పి ఉక్కుపాదం
ఆర్థిక నేరగాళ్ల  మూలాలపై దెబ్బ
బెంబేలెత్తుతున్న అక్రమార్కులు
ఖద్దరు నేతలు సైతం సర్దుబాటు చర్యలు

                   Police

గద్వాలప్రతినిధి: మొన్న నకిలీ విత్తనాల ముఠా.. నిన్న కాల్‌మనీ ముఠా… నేడు క్రికెట్‌బెట్టింగ్ ముఠా… ఇలా ఒకరేమిటి వక్రమార్గంలో అక్రమంగా డబ్బును సంపాదించే ఆర్థిక నేరగాళ్ల తాటతీస్తూ ఉక్కు పాదం మోపుతు నేరగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది ఒకే ఒక్కడు… ఆ ఒక్కడే ఎస్‌పి ఎస్.ఎం.విజయ్‌కుమార్…. ఈపేరు ఇపుడు జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మార్మోగిపోతుంది… గత కొన్ని దశాబ్దాలుగా ఆర్థిక నేరాలకు అలవాటుపడి సమాజంలో కాలర్ ఎగురవేసి తిరుగుతున్న అక్రమార్కులపై పంజా విసురుతూ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు… చెడు పనులు… కాదు కదా… కనీసం వాటి తలంపును కూడ చేయటానికి సహాసించడం లేదంటే జిల్లాల్లో అక్రమార్కుల పరిస్థితి ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతుంది.. గతంలో నేరం చేస్తేనే… గొప్పవాడుగా భావించే పరిస్థితులు… కాని ఇపుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారింది. నేరం కాదు కదా… కనీసం నేరం చేసే వాడికి వత్తాసు పలకాలంటే కూడ బెదిరిపోతున్నారు… ఇంతలా నేరగాళ్లు… మాయగాళ్లను వణికిస్తూ తనదైన శైలీలో చట్టాన్ని అమలు చేస్తున్న వ్యక్తి జిల్లా ఎస్‌పి ఎస్‌ఎం విజయ్‌కుమార్.

ఒకే ఒక్కడు….: పదినెలల కిందట పురుడు పోసుకున్న జోగుళాంబ గద్వాల జిల్లాకు రాష్ట్రం లోనే ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణలో రెండు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ప్రాంతం. దీంతో కొంత వరకు రాయలసీమ, రాయాచూరు ప్రాంతాలకు చెందిన సంస్కృతి కనిపిస్తుంది. ఈప్రాంతం నుంచి రాజకీయంగా ప్రాతినిథ్యం వహించిన నేతలు సైతం రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరుగాంచిన వారున్నారు. కవులు, కళాకారులు, విద్యావంతులకు కూడ పెట్టింది పేరు.. అందుకే నడిగడ్డను విద్వత్‌గద్వాలగా పిలుస్తారు… అయితే ఇది నాణేనికి ఒక వైపు… రెండోవైపు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది… సులువుగా డబ్బును సంపాదించాలనే క్రమంలో కొందరు వక్రమార్గాలను ఎంచుకుని విచ్చల విడిగా డబ్బులను సంపాదించుకున్నారు. దీంతో సహజంగానే వారికి కొన్ని రాజకీయ పార్టీలు ఆశ్రయనివ్వడంతో సమాజంలో ఒక్కసారిగా వారికి పేరు ప్రఖ్యాతలు లభించాయి.. ఈక్ర మంలోనే ఇటివలీ కాలంలో అక్రమార్కులు కాలరెగరేసుకుని దర్జాగా తిరిగే పరిస్థితులు దాపు రించాయి. అయితే నూతన జిల్లా ఏర్పాటు కావడం, జిల్లా స్థాయి అధికారులు రావడంతో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు కనపడుతుంది.. ముఖ్యంగా పోలీసు శాఖకు చెందిన ఎస్పీ ఎస్‌ఎం విజయ్‌కుమార్ ఆర్థిక నేరగాళ్లపై తనదైన శైలీలో ఉక్కుపాదం మోపుతూ దుమ్మురేపు తున్నారు. నేరగాళ్లకు వెన్నులో వణకుపుట్టిస్తు ముచ్చెమటలు పోయిస్తున్నారు.

షీ-టీం ఏర్పా టుతో మహిళల పట్ల వేధింపులకు పాల్పడుతున్న వారికి అడ్డుకట్టవేయడం, స్మైల్ టీంతో బాల కార్మికులను గుర్తించి వారికి వెట్టి నుంచి విముక్తి చేయడం, అధిక వడ్డీ వ్యాపారులు(కాల్‌మనీ ముఠా), నకిలీ విత్తనాల ముఠా, పేకాట రాయుళ్లు, క్రికెట్ బెట్టింగ్ ముఠా ఇలా ఎవరిని కూడ వదలకుండా తాటతీస్తు న్నారు. ఇందులో కొందరు రాజకీయ నేతలు, పోలీసు శాఖకు చెంది న వ్యక్తులపై కూడ కఠినంగా వ్యవహరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. తాజాగా క్రికెట్‌బెట్టింగు ముఠా మూలాలపై దృష్టి సారించి దెబ్బకొడుతున్నారు. కొందరు యువత ఇటవలీ క్రికెట్‌పై ఉన్న క్రేజీతో బెట్టింగులకు అలవాటు పడుతున్నారు. ఇందులో చిక్కుకుని చాలా మంది యువత తమ జీవితాలను సైతం నాశనం చేసుకున్న దఖాల ఉంది. బెట్టింగులో డబ్బులు పెట్టేందుకు ఇంట్లో తల్లిదండ్రులను వేధించడం, బయట అప్పులు చేయడం, మోటా రుసైకిళ్లు, ఇతర విలువైన వస్తువులను తాకట్లు పెట్టడం, కొందరు దొంగతనాలకు అలవాటు పడడం, ఇలా ఎన్ని వక్రమార్గాలున్నాయో అన్ని మార్గాల్లో ప్రవేశించి ఇబ్బందులను పడుతు న్నారు.

అయితే యువత బలహీనతలను ఆసరాగా తీసుకున్న కొందరు ఆర్థిక నేరగాళ్లు వారికి గాలం వేసి అక్రమంగా డబ్బును సంపాదించుకుంటున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ అసలు నేరగాళ్లను బయటకు లాగి తాటతీసే పనిలో నిమగ్నమైయ్యారు. ఇప్పటికే అయి జ, కర్నూలు, గద్వాల ప్రాంతాలకు చెందిన క్రికెట్ బెట్టింగు ముఠాలోని ప్రధాన సూత్రదా రులను గుర్తించి వారికి జైలు ఊచలను లెక్కపెట్టిస్తున్నారు… ఇందులో దాగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడ వదిలే ప్రసక్తే లేదంటూ ముచ్చెమటలు పోయిస్తున్నారు. ఇలాంటి నిక్కచ్చితమై న అధికారి వలన ఎలాంటి అండదండలు లేని వారికి మేలు జరుతుందనేది మెజారిటి ప్రజల అభిప్రాయం.

స్లీపింగ్ మోడులోకి ఖద్దరు నేతలు…: గతంలో ఎదైనా తప్పు చేసినా, నేరానికి పాల్పడిన ముందుగా వెళ్లేది ఖద్దరు నేతల దగ్గరకే… కాని ఎస్పీ కారణంగా పరిస్థితిలో పూర్తిగా మార్పు చోటుచేసుకుంది. ఖద్దరు నేతల దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తెలిసో తెలియకో…. సాయం కోసం వెళితే… ఇపుడు మన పరిస్థితి బాగాలేదు.. ఆఎస్పీ ఉన్నంత వరకు మనదేమి నడవదు.. ఏమి చేయలేము తమ్ముడూ… అంటూ నిట్టూర్సుతున్నారు. పదినెలల కిందట ఫుల్ యాక్టివ్ మోడులో ఉన్న ఖద్దరు నేతలు… ఇపుడు స్లీపింగు మోడులోకి వెళ్లిపోయారనే ప్రచారం జోరుగా సాగుతుంది.