Home హైదరాబాద్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

Supervision of over medical departmentఅభివృద్ధికి ఆమడ దూరంలో ఉస్మానియా ఆసుపత్రి
వైద్య శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం
నాలుగేళ్లుగా సమీక్షకు నోచుకోని అభివృద్ధి కమిటీ సమావేశం

మన తెలంగాణ/గోషామహల్: ఉస్మానియా ఆసుపత్రి అభివృద్ధితో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతీ నెలా, లేదా మూడు నెలలకు ఒకసారి నిర్వహించా ల్సిన సమీక్షా సమావేశాలు గత నాలుగేళ్లుగా జరగక పోవడంతో ఆసుపత్రి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. సంవత్సరానికి కనీసం నాలుగు సార్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ) ఆధ్వర్యంలో సమీ క్షా సమావేశాలు నిర్వహించి రోగులకు అం దుతున్న వైద్యసేవలు, అవసరమైన పరికరాలు, రోగులకు పంపిణీ చేస్తున్న మం దులు, వాటి నాణ్యత రోగులతో పాటు వైద్య సిబ్బందికి కల్పిస్తున్న స దుపాయాలపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్న అనంతరం కమిటీ యుద్ద ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తుంది. అభివృద్ది కమిటీ చేసిన తీర్మానాల మేరకు రోగులకు కల్పించాల్సిన సదుపాయాలు, అవసరమైన పరికరాల కొనుగోలు, ఆసుపత్రి అభివృద్ది కోసం చేపట్టాల్సిన చ ర్యలకు అవసరమైన నిధులను ఆసుపత్రి అభివృద్ది కమిటీ ద్వారా సేకరించి అభివృద్ది కార్యక్రమాలు చేపడతారు.

అభివృద్ది కమిటీ సభ్యులు…
పెరుగుతున్న రోగుల రద్దీకి అనుగుణంగా వైద్యసేవలను పెంపొందించేందుకు ప్రతీ 3 నెలలకు ఒకసారి నిర్వహించే ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరుగుతుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అభివృద్ది కమిటీలో ఛైర్మన్‌తో పాటు రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు, ఆసుపత్రి సూపరింటెండెంట్, రిటైర్డ్ సూపరింటెండెంట్, స్థానిక ఎంపి, ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ, కార్పోరేటర్‌లు కమిటీ సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు ఛైర్మన్ అనుమతితో ఎన్‌జివో సంస్థ ప్రతినిధి, వివిధ యూనియన్‌ల ప్రతినిధులు సమీక్షా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఛైర్మన్ అను మతి లేకపోతే యూనియన్‌ల ప్రతినిధులకు సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండదు.

నిధుల సమీకరణ ఇలా…..
ఆసుపత్రి ప్రాంగణంలోని క్యాంటీన్‌లు, మెడికల్ షాపులు, ఎస్‌టిడి బూత్‌ల నుంచి ప్రతి నెలా అద్దెల రూపంలో చెల్లించే నిధులు ఆసుపత్రి అభివృద్ది కమిటీ ఖాతా లో చేరతాయి. దీంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రిలో నిర్వహించే శస్త్రచికిత్సలపై వైద్యులు, సిబ్బందికి లభించే ప్యాకేజీలో ఆసుపత్రి అభివృద్ది కమిటీ వాటా రూపంలో అభివృద్ది కమిటీ ఖాతాలో జమ అవుతుంది. అంతేకాదు ఎమ్మారై, సిటీస్కాన్ ఫిల్మ్‌లు ఇచ్చినందుకు కొంత మొత్తంలో నిధులు అభివృద్ది కమిటీ ఖాతాలో చేరుతుంది. ఈ నిధులను ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమీక్షా సమావేశంలో చర్చించిన అనంతరం అవసరమైన అభివృద్ది పనుల కోసం వెచ్చిస్తారు. తెల ంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమీక్షా సమావేశాలు జరగలేదు. ఆసుపత్రి అభివృద్దికి అవసరమైన నిధులను వెచ్చించే అధికారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు లేక పోవడంతో అరకొర అభివృద్దితోనే నెట్టుకొస్తున్నారు. గత 4ఏళ్లుగా సమీక్షా సమావేశాలు నిర్వహించక పోవడంతో రోగులకు కల్పించాల్సిన సదుపయాలు, అందించాల్సిన వైద్యసేవలు, అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలు తదితర సమస్యలు తీవ్ర తరం అవుతున్నారు. ఇ ప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు ఆసుపత్రి అభివృద్ది సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆసుపత్రిలో నెలకొన్న స మస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని రోగులకు మెరుగైన, సత్వర వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రోగి సహాయకులు కోరుతున్నారు.