Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రైతు బందు కాదు.. పంటకు మద్దతు ధర కావాలి..

Support price to crop

వలిగొండః ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను అమలు చేయాడం చేతకాక రైతులకు రైతు బందు పథకం పేరుతో టిఆర్‌ఎస్ పార్టీ ఓట్ల రాజకీయలకు పాల్పడుతుందని,మాదిరైతు ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు పండించిన పంటలకు మద్దతు ధరను ప్రభుత్వం కల్పించాలని భువనగిరి కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జీ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో కాంగ్రేస్ పార్టీ జెండాను ఆవిష్కరించి నిర్వహించిన ఇంటింటికి కాంగ్రేస్ కార్యక్రమాన్ని కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సారధ్యంలో పార్టీ కార్యకర్తల సమూహంతో ఇంటింటికి తిరుగుతు కాంగ్రేస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తు 2019 సాధారణ ఎన్నికలల్లో కాంగ్రేస్ పార్టీ అధికారం చేపట్టడం కాయమని భరోసాలను ఇస్తు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాడం చేతకాక,ముఖ్యంగా రైతుల విషయంలో ఋణ మాఫీని బ్యాంక్‌వడ్డీలకే పరిమితం చేసిందని,ప్రభుత్వాని రైతుల పట్ల చిత్త శుద్ది ఉంటే పండించిన పంటలకు మద్దతు ధరను కల్పించాలని డిమాండ్ చేశారుఅనంతరం పార్టీ కార్యాలయంను ప్రారంభించారు,ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ జిల్లా ఉపాద్యక్షులు ఎడ్ల నిరంజన్‌రెడ్డి,పాశం స్వామి,వైస్ ఎంపిపి కుంభం వెంకట్‌పాపిరెడ్డి,కుంభం విద్యాసాగర్‌రెడ్డి,పోలేపాక జానకిరాములు,బోళ్ళ శ్రీనివాస్,బత్తిని సహదేవ్,కాసుల వెంకన్న,వంగాల అశోక్,వడ్డేమను దేవేందర్,మధవరెడ్డి,బుగ్గబీరప్ప,నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments