Search
Saturday 17 November 2018
  • :
  • :

నేతన్నకు అండ

ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించాలి

NETA

మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : నేత కార్మికులకు అండగా నిలబడటానికి అధికారులు సిద్దం అయ్యారు. చెనేత కార్మికులకు ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కెటిఆర్ ఇటివల శాసనసభలో ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులు సైతం దీనికి సహకరించాలని కోరడంతో అధికార యంత్రాగం సైతం ముందుకు వచ్చింది. తెలంగాణలోని రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం చెనేత దుస్తులు దరించడానికి సిద్దం అవుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల కలెక్టర్‌లు రఘనందన్‌రావు, యం.వి.రెడ్డి, దివ్య దేవరాజన్‌లు దీనిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన కలెక్టర్‌లు ప్రతి సోమవారం నాడు ప్రభుత్వ ఉద్యోగులు చెనేత దుస్తులు ఖచ్చితంగా దరించి ఉద్యోగంకు రావడంతో పాటు అన్ని స్థాయిల్లో దీనిపై ప్రచారం నిర్వహించి చెనేత దుస్తులు దరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేయడంతో పాటు తాము సైతం ఆచరణలో ముందుండటానికి ఇప్పటికే చెనేత దుస్తులు కొనుగోలు చేశారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా చెనేత దుస్తుల కౌంటర్‌లు ఎర్పాటు చేసి ఉద్యోగులకు సరసమైన ధరలకు అందేలా చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి కలెక్టర్ రఘనందన్‌రావు స్వయంగా ఉద్యోగులకు చెనేత దుస్తులు అందచేశారు.
అధికారుల స్పూర్తితో…యువత సైతం…
మంత్రి కెటిఆర్ సూచనలతో అధికారులు చెనేత దుస్తులు దరించడానికి సిద్దం అవుతుండగా జిల్లాలోని గులాభీ దళంలోని నేతలతో పాటు యువకులు సైతం చెనేత దుస్తులు దరించడానికి ముందుకు వస్తున్నారు. జిల్లాలోని శివారు ప్రాంతాల్లో ఇటివల చెనేత దుస్తుల ప్రదర్శలను పెద్ద ఎత్తున ఎర్పాటు చేస్తుండటంతో పాటు సరసమైన ధరలకు విక్రయాలు చేస్తుండటంతో యువకులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తున్నారు. చెనేత పరిశ్రమను ఆదుకోని కార్మికులను రక్షించుకోవడానికి ప్రభుత్వంతో పాటు ప్రతి ఫౌరుడు తమ వంతు భాద్యతగా తీసుకుని ముందుకు పోవలసిన అవసరం చాలా వరకు ఉంది. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ఇతర అసంఘటిత రంగ కార్మికులను సైతం ప్రొత్సాహించి చెనేత దుస్తుల వైపు తీసుకువస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది.

Comments

comments