Home తాజా వార్తలు సింగరేణి సమ్మెకు మద్దతు

సింగరేణి సమ్మెకు మద్దతు

Kodandaram

హైదరాబాద్ : సింగరేణి కార్మికుల సమ్మెకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్టు టిజెఎసి కన్వీనర్ కోదండరాం తెలిపారు. సింగరేణి కార్మికుల శ్రమను వెలకట్టలేమని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఈనెల 21వ తేదీ నుంచి పాదయాత్ర నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో జరిగిన భూకుంభకోణాలపై న్యాయ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై టిజెఎసి ఉద్యమాలు నిర్మిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యల సాధనలో అన్ని ప్రజా సంఘాల మద్దతు కూడగట్టుకుని ముందుకు సాగుతామని ఆయన తేల్చి చెప్పారు.