Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

శ్రీనివాసన్‌కు సుప్రీం మొట్టికాయ

srinivasan

న్యూఢిల్లీ : ఐసిసి (ఎస్‌జిఎమ్) సర్వ సభ్య సమా వేశానికి బిసిసిఐ మాజీ అధ్యక్షడు ఎన్ శ్రీనివాసన్ హాజరు కావడంపై సర్వోన్నత న్యాయస్థానం సు ప్రీంకోర్టు తప్పుబట్టింది. లోథా కమిటీ సిఫార్సుల ఆధారంగా సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఐసిసి భేటీకి అనర్హులైన వ్యక్తులను నామినేట్ చేయవచ్చు లేదా, స్టేట్ అసోసియేషన్‌లో జరిగే సమావేశాల్లో పాల్గొనవచ్చా లేదా అనేదానిపై స్పష్టత కోరుతూ (సిఒఎ) బిసిసిఐ పాలకుల కమిటీ సుప్రీంకోర్టుకు విన్నవించింది.

ఈ నేపథ్యంలో అర్హులైన సభ్యులు భేటీలో పాల్గొనే విషయంలో కోర్టు తీర్పు కోసం బిసిసిఐ బోర్డు వేచి చూసింది. దీనిపై సోమవారం విచారించిన అపెక్స్ కోర్టు ఎస్‌జిఎమ్ భేటీకి అనుర్హులకు అనుమతి లేదనే నిర్ణయాన్ని వెలువ రించింది. అయితే ఆదివారం సికె ఖన్నా అధ్యక్షత న ఏర్పాటు చేసిన ఐసిసి సర్వసభ్య సమావేశంలో శ్రీనివాసన్ సహా, రాజీవ్ శుక్లా, నీరంజన్ షా, టిసి మ్యాథ్యూ హాజరయ్యారు. పాలకుల కమిటీ హెచ్చరించినప్పటికీ కూడా శ్రీని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడితో కలిసి హాజర య్యారు. దీంతో ఐసిసి భేటీని బిసిసిఐ బోర్డు బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా, ఎస్‌జిఎమ్ సమావేశం ఏర్పాటు చేసినప్ప టికీ ఎలాంటి చర్చ జరుగకముందే వాయిదా వేసినట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి.

Comments

comments