Home జాతీయ వార్తలు ఒక పాపం విశ్వాసం ఎలా అవుతుంది?

ఒక పాపం విశ్వాసం ఎలా అవుతుంది?

తలాక్‌పై తీర్పు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ప్రశ్న

supreme-courtన్యూఢిల్లీ: ఓ పాపపు పనిని విశ్వాసానికి సంబం ధించిన విషయంగా ఎలా పేర్కొంటారు? అని సుప్రీంకోర్టు గురువారం ముస్లిం సంస్థలను నిలదీ సింది. ఈ ఆచారం తప్పని ముస్లిం సంస్థలే పేర్కొంటున్నాయని, దీనిని ఏ విధంగా సమర్థి స్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ట్రిపుల్ తలా ఖ్‌పై తీర్పును రిజర్వ్ చేసిన అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలను వెలువరిం చింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహార్ నాయకత్వం వహిస్తు న్నారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున వాదించిన సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్న అంశాలను ప్రాతిపదికగా తీసుకునే ధర్మాసనం స్పందించింది. ట్రిపుల్ తలాఖ్ పాపం అవుతుం దని న్యాయవాది చెప్పారని, మరి దీనిని ఆచారా లు, విశ్వాసాల ప్రతీకగా ఎలా అభివర్ణించుకుం టారు? దీని పట్ల అంకితభావం ప్రదర్శిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ట్రిపుల్ తలాఖ్‌ను సవా లు చేస్తూ దాఖలయిన పలు పిటిషన్లపై వరుసగా జరిగిన వాదోపవాదాల తరువాత సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది. వేసవి సెలవులను కూడా పక్కకు నెట్టి ధర్మాస నం విచారణ నిర్వహించింది.  ట్రిపుల్ తలాఖ్ అంశం పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం  తమ తీర్పును రిజర్వ్ చేసింది. ఆరు రోజుల వాదోప వాదాల తరువాత ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పునుతరువాత ప్రకటిస్తామని తెలిపింది.  కేంద్రం, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఆలిండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు ఇతరులు వేసిన పిటిషన్లపై కీలక స్థాయిలో వాదనలు జరిగాయి. ముస్లి ం పర్సనల్ లా బోర్డు తరఫున సీనియర్ లాయర్, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యక్తిగత స్థాయిలో సహకరించారు. బోర్డు తరఫున ప్రదాన వాదనను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విన్పించారు. ఖురాన్‌లో ట్రిపుల్ తలాఖ్‌ను ప్రస్తావించలేదని, అయితే ఇది ఖచ్చితంగా పాపం అని, దుష్టాచారం అని అవాంఛ నీయం అని చెపుతూనే దీనిని న్యాయస్థానం పరిశీలించ రాదని స్పష్టం చేశారు. ఈ దశలో న్యాయ స్థానం కలుగచేసుకుని ఓ వైపు ఖుర్షీద్ ఈ ఆచారం పాపం అని చెపుతున్నారని మరో వైపు ఇది విశ్వాసాలకు సంబం ధించిన అంశం అంటున్నారని, పాపపు చర్యను విశ్వా సంగా ఎందుకు పాటించాలని ప్రశ్నించింది. ఈ ఆచారం తరాలుగా సాగుతోందని, అయితే ప్రపంచవ్యాప్తంగా లేదని న్యాయవాది చెప్పారని , అంతేకాకుండా ఈ విధానమే చేటుగా , దుష్టబుద్ధితో ఉందని న్యా యమూర్తులు కురియన్ జోసెఫ్, ఆర్‌ఎఫ్ నారిమన్ , యుయు లలిత్, అబ్దుల్ నజీర్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మసనం  తెలిపింది. చట్టపరంగా ట్రిపుల్ త లాఖ్ సముచితం కాదని, అయితే న్యాయస్థానాల జోక్యం ఇందులో తగదని ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యానాలపై ధర్మాసనం స్పందిం చింది. నైతికంగా అనుచి తమైది చట్టపరంగా చెల్లనేర దని ధర్మాసనం తెలిపింది.  ట్రిపుల్ తలాఖ్ బాధితు రాలు షయారా బానో తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అమిత్ సింగ్ ఛాదా తమ వాదన విన్పిస్తూ ఈ విధానం ఇస్లాంకు విరుద్ధంగా ఉందని తెలిపారు. పర్సనల్ లా బోర్డు వాదనలను తిప్పికొట్టారు. తలాఖ్ విధానం పూర్తిగా పురుషాధిపత్య ధోరణితో ఉందని , పలు ఆలోచనా వేదికలలో దీనిపై అసమ్మతి వ్యక్తం అ యిందని తెలిపారు. ప్రజలకు న్యాయస్థానమే ఆశారేఖ గా ఉందని, కీలకమైన ఈ అంశంపై నిర్ణయా ధికారాన్ని ఇతరులకు అప్పగించరాదని కోరారు. ఓ వైపు పర్సనల్ లా బోర్డు ఆచారం మంచిది కాదని చెపుతూనే దీనిని కొనసాగించాలని కోరుతోంది.