Home జాతీయ వార్తలు ఆరు నెలలు దాటాక గర్భవిచ్ఛిత్తి కుదరదు : సుప్రీంకోర్టు

ఆరు నెలలు దాటాక గర్భవిచ్ఛిత్తి కుదరదు : సుప్రీంకోర్టు

pregnant-women

న్యూఢిల్లీ : ఆరు నెలలు దాటిన గర్భం విచ్ఛిత్తి అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 27 వారాల గర్భస్థ శిశువుకు పలు శారీరక అవలక్షణాలు ఉన్నాయని , ఈ దశలో గర్భస్రావానికి వీలు కల్పించాలని ఓ మహిళ తమ పిటిషన్‌లో వేడుకుంది. అయితే ఈ దశలో గర్భవిచ్ఛిత్తి జరిగినా శిశువు సజీవంగానే పుడుతుందని అందిన వైద్య నివేదిక ఆధారంగా ధర్మాసనం తమ నిర్ణయం వెలువరించింది.

అయితే 27వ వారంలో ఉన్న పిండం విచ్ఛిత్తికి పాల్పడితే శిశువు సజీవంగానే పుడుతుందని పలువురు వైద్యులతో కూడిన మండలి తేల్చిచెప్పింది. దీనిని పరిగణనలోకి తీసుకుని ఈ మహిళకు గర్భస్రావానికి అనుమతి తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తులు ఎస్‌ఎ బొడ్బే, ఎల్ నాగేశ్వర రావుతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. తల్లి ప్రాణానికి, పిండానికి ముప్పు పొంచి ఉందని తెలిసినా 20 వారాల గర్భం తరువాతి దశలో గర్భవిచ్ఛిత్తిని నిషేధిస్తూ చట్టం అమలులో ఉంది.