Home జాతీయ వార్తలు 550 జిఒపై హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీం

550 జిఒపై హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీం

Supreme Court Discontent on High Court Judgement on GO no 550

మన తెలంగాణ/ న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సులకు ప్రవేశాలు నిర్వహించే ప్రక్రియలో జిఒ 550పై హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జిఒలోని పేరా 5 (2) న్యాయ సమ్మతమే అయినప్పటికీ దీనిని ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా సహేతుకంగా అమ లు చేయలేరని పేర్కొంటూ ఈ జిఒపై హై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అందువల్ల వచ్చే ఏడాది కౌన్సెలింగ్ కు సంబంధించి తగిన మార్పులు చేసుకునేందుకు తెలంగాణ, ఎపి ప్రభుత్వాలు, కాళోజీ విశ్వవిద్యాలయం, ఎన్‌టిఆర్ విశ్వవిద్యాలయానికి అవకాశం ఇచ్చింది. అయితే 201819 విద్యా సంవత్సరానికి ఇదివరకే జరిగిన ప్రవేశాలను మళ్లీ జరపరాదని సుప్రీంకోర్టు తెలిపింది. 550 జీవోపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 550 జీవోపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 16 మంది విద్యార్థులు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, కాళోజి విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌లను గురువారం విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ ఆదేశాలను మరోసారి పరిశీలించి సోమవారం రాతపూర్వకంగా వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.