Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

కోర్టుల్లో విచారణ లైవ్‌కు సిజెఐ సుముఖత

Supreme Court favours live-streaming of court proceedings

ఢిల్లీ : కోర్టుల్లో వివిధ కేసులపై జరిగే వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సుముఖత వ్యక్తం చేశారు. దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయంపై జులై 23వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో జరిగే వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే అంశాన్ని గతంలో అటార్నీ జనరల్ సమర్థించిన విషయం తెలిసిందే. ప్రాముఖ్యత కలిగిన అంశాలపై జరిగే వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సుప్రీంకోర్టు అనుకూలంగానే ఉందని, అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సూచించాలని ధర్మాసనం పేర్కొంది. ఆధార్, గే సెక్స్ వంటి అంశాలపై కోర్టు ప్రోసీడింగ్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తమకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ అంశాన్ని కోర్టు ప్రస్తావించింది.

Supreme Court favours live-streaming of court proceedings

Comments

comments