Home జాతీయ వార్తలు కేంద్రంపై సుప్రీంకోర్టు గుస్సా!

కేంద్రంపై సుప్రీంకోర్టు గుస్సా!

Supreme court fires on central government

న్యూఢిల్లీ: గతేడాది సెప్టెంబర్ లో రాజకీయ నేతలపై కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై అభిప్రాయాన్ని తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశించింది. క్రిమినల్ కేసులు ఉన్న పార్లమెంటు సభ్యులు, ఎంఎల్ఎల వివరాలను ఇవ్వాలని ఆదేశించినప్పటికీ కేంద్రం స్పందించకపోవడంపై సుప్రీం కోర్టు ఫైర్ అయింది. ఈ కేసులను పరిష్కరించడానికి అదనపు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారా..? లేదా..? అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని చెప్పింది. ఈ విషయమై సెప్టెంబర్ 5కల్లా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం వార్నింగ్ ఇచ్చింది. నేతలపై దాఖలైన కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. వీటి ఏర్పాటుకు, మౌలికవసతుల కల్పనకు పార్లమెంటులో చట్టం చేయాలని సూచించింది.  తదుపరి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది.