Home జాతీయ వార్తలు మోడీని చోర్ అన్న రాహుల్.. సుప్రీం నోటీసులు!

మోడీని చోర్ అన్న రాహుల్.. సుప్రీం నోటీసులు!

Modi And Rahulన్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఝులక్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ దొంగ అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై సోమవారం నోటీసులు జారీచేసింది. తన వ్యాఖ్యలపై ఏప్రిల్ 22లోగా జవాబు చెప్పాలని ఆయనను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23న చేపడతామని సుప్రీం పేర్కొంది. బిజెపి పార్లమెంటు సభ్యురాలు మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నట్టు ప్రధాని మోడీపై గత కొన్నిరోజులుగా రాహుల్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల లీకైన రఫేల్ పత్రాల ఆధారంగా గతంలో రఫేల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును పున:సమీక్షించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్.. చౌకీదార్ చోర్(మోడీ దొంగ) అని సుప్రీంకోర్టే చెప్పిందని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుతో రఫేల్ ఒప్పందంలో ఏదో తప్పు ఉందని తేటతెల్లమయిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై బిజెపి పార్లమెంటు సభ్యురాలు మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో కేసు వేసింది. 

Supreme Court Notice to Rahul Gandhi for Chowkidar Chor