Home జాతీయ వార్తలు ఇసికి సుప్రీం కోర్టు నోటీసులు

ఇసికి సుప్రీం కోర్టు నోటీసులు

Supreme-courtన్యూఢిల్లీ: ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. గుజరాత్‌లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇసికి నోటీసులు ఇచ్చింది. గతంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న అమిత్ షా, స్మృతీ ఇరానీలు పార్లమెంట్ కు ఎన్నికవడంతో ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఇసి సిధ్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ రెండు స్థానాలకు జూలై 5న విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం మొదట నిర్ణయించింది.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ గుజరాత్ శాఖ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రెండు సీట్లలో ఒక దాన్ని గెలుచుకునే చాన్స్ ను తాము ఈ నిర్ణయం ద్వారా కోల్పోతామని కోర్టుకు వెల్లడించింది. వాటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ఇసిని ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరింది. కాంగ్రెస్ వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై ఇసికి నోటీసులు జారీ చేసింది. జూన్ 24లోగా అభిప్రాయాన్ని చెప్పాలని ఎన్నికల సంఘానికి గడువు విధిస్తూ కేసును జూన్ 25కు కోర్టు వాయిదా వేసింది.
Supreme Court Notices to Election Commission