Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఆధార్‌తో పాన్ లింక్‌పై సుప్రీంకోర్టు స్టే

PAN-Card-Aadhaar-Carad

న్యూఢిల్లీ: ఆధార్ కార్డు తప్పనిసరి నిబంధనపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. దీనిలో భాగంగా ఆధార్‌తో పాన్‌కార్డు అనుసంధానం ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునే వరకు స్టే కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. పాన్ కార్డుకు ఆధార్ లింక్ తప్పనిసరి కాదని తెలిపింది. అలాగే ఐటి రిటర్న్ దాఖలుకు కూడా ఆధార్ తప్పనిసరి కాదని న్యాయస్థానం చెప్పింది. అయితే ఆదాయపన్ను సెక్షన్ 139ఎ ప్రకారం ఐటి దాఖలు చేసేటప్పుడు పాన్ నెంబరు జతచేయడం తప్పనిసరి అని పేర్కొంది. అంతేగాక ఆధార్ డేటా లీక్ కాకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించింది.

Comments

comments