Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

డిస్మిస్

‘ఎన్ని కేసులు పెట్టినా న్యాయం, ధర్మమే గెలుస్తాయి. ఆరునూరైనా ప్రాజెక్టులు కట్టి తీరుతాం. త్వరలోనే కాళేశ్వరం ఫలితాలను ప్రజలకు అందిస్తాం. ఈ ప్రాజెక్టుపై 86 కేసులు వేశారు. సుందిళ్ల కేసును కూడా సుప్రీంకోర్టు కొట్టి వేసింది. కోర్టుల్లో పరాభవం పాలైనా వారి బుద్ధి మారడంలేదు’
– ఢిల్లీలో మంత్రి హరీశ్‌రావు

కాళేశ్వరంపై పిటిషన్‌ను త్రోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం 

Harish-rao

హైదరాబాద్/ న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్ ను సవాలుచేస్తూ రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టకుండానే కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వం డిజైన్ ను మార్చి కాళేశ్వరంను నిర్మించడం వలన సుమారు రూ. 40 వేల కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగమవుతుందని, 144 టిఎంసిల కంటే ఎక్కువ నీటిని నిల్వ చేయలేకపోతున్నప్పటికీ 170 టిఎంసిలను నిల్వ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వ్యాఖ్యానించడం వాస్తవ విరుద్ధమని ఆ పిటిషన్‌లో లక్ష్మీనారాయణ ఆరోపించా రు. తెలంగాణ ప్రభుత్వం అవసరానికి మించిన నీటి నిల్వ సామర్థంతో ప్రాజెక్టు కడుతోందని పేర్కొన్నారు. జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను సోమవారం విచారించి హైకోర్టును ఆశ్రయించాలని, అక్కడ ఉత్తర్వులు వెలువడిన అనంతరం అభ్యంతరం ఉన్నట్లయితే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతగీ వాదనలు వినిపించి తెలంగాణ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును కడుతుందో, పిటిషనర్ లేవనెత్తిన వాదనలు ఏ విధంగా అవాస్తవమైనవో వివరించారు. హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం పేర్కొనగానే, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం మహారాష్ట్రకు కూడా సంబంధించినదని, అంతర్‌రాష్ట్ర విషయమైనందున సుప్రీంకోర్టే విచారించడం సమంజసమని లక్ష్మీనారాయణ తరఫున న్యాయవాది వాదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, నిజంగా ఈ ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేసినట్లయితే అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని వివరించింది. తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ఒకవేళ పిటిషనర్ వాదిస్తున్నట్లుగా ఈ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రకు అభ్యంతరంపన్నట్లయితే, హైకోర్టు తన విచారణ సందర్భంగా ఆ రాష్ట్రానికి నోటీసులు జారీ చేసినట్లయితే అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.
మంత్రి హరీశ్‌రావు సంతోషం :
కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవాలన్న దుష్ట శక్తులకు సుప్రీంకోర్టు సోమవారం వెలువరించిన ఉత్తర్వులు ఒక చెంపపెట్టు అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా కుట్రలను ఆపాలని వ్యాఖ్యనించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ వచ్చాయని, ఈ రోజు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో కేవలం పని ఆపాలని మాత్రమే ఉందని గుర్తుచేశారు. కాళేశ్వరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఏదో ఒక రకంగా పద్మవ్యూహంలోకి నెట్టాలనే తపన కేసులు వేస్తున్నవారిలో కనిపిస్తోందని వ్యాఖ్యనించారు.

Comments

comments