Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్రియా వారియర్ కేసు కొట్టివేత…

Supreme Court quashes FIR against Priya Varrier

న్యూఢిల్లీ: నటి ప్రియా ప్రకాశ్ వారియర్ ‘ఒరు అదార్ లవ్’ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటలో కన్నుగీటే సన్నివేశంతో రాత్రికి రాత్రే ఆమె సోషల్ మీడియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. అయితే, కన్నుగీటుతో మొత్తం ప్రపంచాన్ని కట్టిపడేసిన ప్రియా వారియర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం ఊరట ఇచ్చింది. ప్రియాపై వేసిన పోలీసు కేసును సుప్రీం కోర్టు కొట్టేసి, ప్రథమ సమాచార నివేదికను రద్దుచేసింది. అంతేకాకుండా పోలీసులకు బాగా చురకలంటించింది. తమ మతం కన్నుకొట్టడాన్ని అనుమతించదంటూ ముఖీత్ ఖాన్, జహీరుద్దీన్ అలీఖాన్ అనే ఇద్దరు ఆమెపై ఫిర్యాదు చేశారు. దీన్ని ఆధారంగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిన్మాలో ఎవరో ఏదో పాట పాడుతారు. మీకు కేసు నమోదు చేయడం తప్ప వేరే పనేమీ లేదా..? అని పోలీసులకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నగర పోలీసులకు మండిపడ్డారు. ఒరు ఆధార్ లవ్ అనే సినిమాలోని పాటలో ప్రియ వారియర్ కన్నుగొట్టే సీన్ ఉంది. ఈ పాటతో మతపరమైన భావాలను దెబ్బతీశారని ఆమెపై, దర్శకునిపై కేసుపెట్టారు. కాగా, ఈ ఆరోపణలు ప్రియకు వర్తించవని కోర్టు వెల్లడించింది. సోషల్ మీడియాలో ఈ సాంగ్, ప్రియ అభినయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Comments

comments