Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

వాయు కాలుష్యంపై సుప్రీం సూచనలు

supreme-court

ఢిల్లీ : ప్రాణాంతకంగా మారుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం సుప్రీంకోర్టు కేంద్రానికి పలు సూచనలు చేసింది. కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు బీమా నిలిపివేయాలని ఆయా కంపెనీలను ఆదేశించింది. కాలుష్య ధ్రువీకరణ ప్రతాలు లేకపోతే, ఆ వాహనాలను రోడ్లపైనే నిలిపివేయాలని జస్టిస్ మదన్. బి.లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. పర్యావరణవేత్త ఎంసి మెహతా వేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Supreme Court References on Air Pollution

Comments

comments