Search
Saturday 17 November 2018
  • :
  • :

నిర్భయ కేసు: ఉరేసరి!

Supreme Court Rejects Convicts' Plea in Nirbhaya Case

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు శిక్ష తగ్గించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఉరి శిక్ష పడ్డ ముగ్గురు నిందితులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. వారికి ఉరేసరి అని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. 2012 డిసెంబర్ 16న సౌత్ ఢిల్లీ ప్రాంతంలో సహ విద్యార్థితో కలిసి బస్సులో వెళ్తున్న ఓ పారమెడికల్ విద్యార్థినిపై ఆరుగురు దుండగులు దారుణంగా అఘాయిత్యానికి పాల్పడి, గాయపరిచిన ఘటన దేశం మొత్తాన్ని కలిచి వేసింది. బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.

Comments

comments