Home తాజా వార్తలు కేంద్ర, రాష్ట్రాల మధ్య సఖ్యత తప్పనిసరి…

కేంద్ర, రాష్ట్రాల మధ్య సఖ్యత తప్పనిసరి…

Supreme-Court

ఢిల్లీ: కేంద్ర, ఢిల్లీ రాష్ట్ర సంబంధాల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉండాలని జస్టిస్ దీపక్ మిశ్రా తెలిపారు. లెఫ్టినెంట్  గవర్నర్, ఢిల్లీ ప్రభుత్వం మధ్య అధికారాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కోర్టు సూచించింది. కేబినెట్ నిర్ణయాలన్నీ లెఫ్టినెంట్  గవర్నర్‌కు తెలియజేయాలని, అన్ని అంశాల్లో లెఫ్టినెంట్  గవర్నర్ జోక్యం అవసరంలేదని వెల్లడించింది. లెఫ్టినెంట్  గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఢిల్లీ ప్రభుత్వానికి ఆటంకాలు కలిగించవద్దని పేర్కొంది. లెఫ్టినెంట్ గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించాలని సూచనలు చేసింది.

దేశ రాజధాని ఢిల్లీలో నిరసన తెలుపుతున్న ఐఎఎస్ అధికారులు పనుల్లోకి రావాలని లెఫ్టినెంట్ గవర్నర్ అడిగే వరకు కదిలేది లేదంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఆయన నివాసంలో నిరసన బైఠాయింపు చేసిన విషయం తెలిసిందే. తాను, డిప్యూటీ సిఎం మనీశ్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సతేందర్ జైన్, గోపాల్ రాయ్ రాజ్‌భవన్‌కు వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ఢిల్లీ ప్రభుత్వ డిమాండ్లు ముందుంచామని, కానీ ఆయన వాటిని తిరస్కరించారని కేజ్రీవాల్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘లెఫ్టినెంట్ గవర్నర్ చేతికి లేఖ ఇచ్చాం. ఆయన చర్య తీసుకోడానికి నిరాకరించారు. రాజ్యాంగం విధి ప్రకారం నడుచుకోవడం ఆయన బాధ్యత. ఆయన చర్య తీసుకోడానికి తిరస్కరించడంతో వేరే మార్గం లేక నిరసనకు కూర్చోవలసి వచ్చింది. ఆయన చర్య తీసుకునే వరకు కదిలేది లేదని మేమాయనకు మృదువుగానే చెప్పాం. మేము ఆయన ఛాంబర్ నుంచి బయటికి వచ్చి ఆయన వెయిటింగ్ రూమ్‌లో కూర్చున్నాం’ అని కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నాలుగు నెలలకు పూర్వం ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు, ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ మీద దాడి చే యడంతో… ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులతో స మావేశా లను ఐఎఎస్ అధి కారులు బాయ్‌కా ట్ చేస్తున్నారు. కేజ్రీవా ల్ డిమాండ్లలో ఐఎఎస్ అధికారులను శిక్షించా లన్నది కూడా ఉంది. తమ పై వచ్చిన ఆరోప ణలు విపరీతమైనవని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది.