Home తాజా వార్తలు ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీం ఉత్తర్వులు జారీ

ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీం ఉత్తర్వులు జారీ

Supreme Court Issues Notice to Centre on Lokpal Appointment

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టు ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 15ను నాటికి ఎపిలో తాత్కాలిక భవనం పూర్తవుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌పై సుప్రీం సంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త సంవత్సరం రోజున ఎపిలో హైకోర్టు ప్రారంభమవుతుందని సుప్రీం స్పష్టం చేసింది. జడ్జిల నివాసాల కోసం అద్దె భవనాలను ఏర్పాటు చేయాలని ఆ  రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మౌలిక సదుపాయాల కల్పన తరువాత హైకోర్టు విభజన పూర్తి స్థాయిలో జరుగుతుందని సుప్రీం వెల్లడించింది.

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబరు 15వ తేదీకల్లా హైకోర్టు అవసరాల నిమిత్తం తాత్కాలిక భవనాలను నిర్మిస్తున్నామని గతంలో సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఒక ప్రముఖ ప్రైవేటు నిర్మాణ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చామని, ఇందుకోసం రూ. 1685 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు ఆ అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొన్న విషయం విధితమే. హైకోర్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర ప్రభుత్వం గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై జరుగుతున్న విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై విధంగా స్పష్టత ఇచ్చింది. శాశ్వత భవనాల నిర్మాణానికి మరికొంత సమయం పడుతున్నందున ప్రస్తుతానికి తాత్కాలిక భవనాల్లోనే హైకోర్టును పనిచేసేలా ప్రభుత్వం ఆలోచిస్తోందని, డిసెంబరు 15వ తేదీకల్లా ఈ పక్రియను పూర్తి చేయనున్నట్లు ఆ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారీమన్ స్పష్టం చేశారు.

Supreme Verdict on Joint High Court Issue

Telangana news