Home Default వేసవి సెలవుల తరువాత రేపటి నుంచి సుప్రీం

వేసవి సెలవుల తరువాత రేపటి నుంచి సుప్రీం

Supreme Court

 

న్యూఢిల్లీ : వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు వచ్చే వారం కీలక సున్నితమైన వ్యాజ్యాలను విచారణను తిరిగి చేపడుతుంది. అయోధ్య , రాఫెల్ వంటి కీలక కేసులు అందులోనూ విస్తృత ధర్మాసనాలతో కూడిన అంశాలు ఈ వేసవి సెలవుల అనంతర దశలో కీలక దశకు చేరుకుంటాయి. ఆరు వారాల వేసవి సెలవుల తరువాత సుప్రీంకోర్టు జులై 1వ తేదీన తిరిగి ప్రారంభం అవుతుంది. రాఫెల్ దీని అనుబంధంగా రాహుల్‌పై దాఖలు అయిన కోర్టు ధిక్కార కేసు వంటివి పూర్తి స్థాయి కోర్టు విచారణకు తిరిగి చేపడుతుంది.

రాఫెల్ కేసుపై సమీక్షకు దాఖలు అయిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరిస్తుందని భావిస్తున్నారు. అన్నింటి కన్నా కీలకంగా అయోధ్య వివాదాన్ని రాజీమార్గాలలో పరిష్కరించుకోవాలని వేసవి సెలవులకు ముందు ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏర్పాటు అయిన కీలక వ్యవస్థ సిఫార్సులతో అయోధ్య వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. జమ్మూ కశ్మీరలకు ప్రత్యేక హక్కులు, కల్పించే ఆర్టికల్ 35 ఎ రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపడుతుంది.

SC will resume on july 1st after summer holidays