Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

377పై సుప్రీం ఇష్టం

ind

 స్వలింగ కాపురాల చెల్లుబాటు అంశాన్ని అత్యున్నత న్యాయస్థానికే వదిలిన కేంద్రం 

న్యూఢిల్లీ: అసహజ లైంగిక సంబంధాల ను (లెస్బియన్ సెక్స్) శిక్షార్హం చేసే ఐపిసి సెక్షన్ 377 చెల్లుబాటు అంశాన్ని కేం ద్రం సుప్రీంకోర్టుకే వదిలిపెట్టింది. మగ లేదా ఆడ మధ్య సంపర్కబంధం నేరం చేసే నిబంధన చెల్లుబాటును న్యాయమూర్తుల విచక్షణకే వదిలిపెడుతున్నట్లు తెలిపింది. ఇద్దరు యుక్త వయస్కుల అసహజ లైంగిక సంబంధాల అంశం వివాదాస్ప దమైంది. ఒకే లింగానికి చెందిన వారి మధ్య వారు యుక్త వయస్కులైనప్పటికీ అంగీకారపూర్వకంగా సంపర్కం జరిపినప్పటికీ దానిని నేరంగా నిర్దారిస్తూ 2013లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన పంచసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదన విన్పించారు. శిక్షార్హ నిబంధ న చెల్లుబాటు అంశాన్ని గౌరవనీయ న్యాయస్థానం పరిశీలించేందుకు తమకు అభ్యంతరం లేదని కేంద్రం తెలిపింది. నేరంగా పరిగణిస్తూ ఉన్న 377 నిబంధనపై న్యాయస్థానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపింది. ఈ విచారణ బుధవారం రెండో రోజు కూడా సాగింది. ప్రధాన న్యాయమూర్తితో పాటు ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, ఎఎం ఖాన్విల్కర్, డివై చంద్రచూడ్, ఇందూ మల్హోత్రా ఉన్నారు. తామే ఈ అంశాన్ని పరిశీలిస్తామని విచారణ సందర్భంగా ఒక్కరోజు క్రితమే తెలియచేశామని ధర్మాసనం తెలిపింది. లైంగిక సంబంధాల విషయంలో భాగస్వాములను ఎంచుకోవడం ప్రాధమిక హక్కుగా ఉన్నప్పుడు, ఆమె కానీ అతడు కానీ తమ జెండర్‌కు చెందిన వారినే పెళ్లాడాలనుకుంటే, లైంగిక సంబంధాలు పెట్టుకుంటే దానిని న్యాయాధికారులు కాదంటే వివాహ సంబంధిత చట్టాలకు విరుద్ధమే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇతర విషయాలను తాము పరిశీలించడం లేదని , అన్నింటినీ ఒకేసారి విచారించడం కుదరదని తెలిపారు. ప్రకృతిపరమైన సహజ పద్ధతులకు విరుద్ధంగా సంప్కరానికి పాల్పడే వారి పట్ల వ్యవహరించే పద్ధతిని సెక్షన్ 377లో ప్రస్తావించారు. ఇది మనుష్యులకు జంతువులకు కూడా వర్తిస్తుంది. ఈ విధమైన సెక్స్‌కు పాల్పడటం జరిగితే యావజ్జీవ శిక్షకు వీలుంది. కొన్ని సందర్భాలలో పది సంవత్సరాలకు పరిమితం అవుతుంది. లేదా జరిమానాలతో ముగుస్తుంది. 2009లో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన కీలక తీర్పులో సెక్షన్ 377 రాజ్యాంగ వ్యతిరేకం అని పేర్కొంది. ఇద్దరికి అంగీకారం ఉంటే తప్పేమీ లేదని తెలిపింది. అయితే దీనిని సుప్రీంకోర్టు 2013లో కొట్టివేసింది. ఒకే జెండర్‌కు చెందిన ఇద్దరి మధ్య లైంగిక సంబంధాలు ఉండటం నేరార్హమైన శిక్షగా చేస్తూ ఇంతకు ముందటి సెక్షన్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది. ఇప్పుడు ఈ సెక్షన్ చెల్లుబాటును సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. పౌరుల హక్కులకు ఈ తీర్పు ఉల్లంఘనగా పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ ఇప్పుడు కీలక దశకు చేరింది.

Comments

comments