Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

జమిలి ఎన్నికలకు వ్యతిరేకం : సురవరం

Suravaram Comments on Jamili Elections

అనంతపురం : జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన సరికాదని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోడీ పాలనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ప్రచారం చేయాలని సిపిఐ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలపై ప్రజల్లో చైతన్యం తేవాలని ఆయన సిపిఐ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

Suravaram Comments on Jamili Elections

Comments

comments