Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మెగాస్టార్ తర్వాత బన్నీతో?

Surender Reddy Upcoming Movie With Allu Arjun

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘సైరా’ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ చిత్రానికి ముందు రామ్‌చరణ్‌తో ‘ధృవ’ను రూపొందించి మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ దర్శకుడు. దీంతో చిరంజీవితో సినిమా చేసే అవకాశం అతనికి లభించింది. ఇలా మెగా ఫ్యామిలీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్న సూరీకి ఇప్పుడు మరో అవకాశం లభించిందట. ‘సైరా’ తర్వాత సురేందర్ రెడ్డి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. సూరి-బన్నీల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రేసుగుర్రం’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా రూ.60 కోట్ల షేర్ వసూలు చేసి అదరగొట్టింది. అప్పటి నుండి ఈ హిట్ కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘రేసుగుర్రం’ సీక్వెల్‌గా ఆ సినిమా ఉండవచ్చని కూడా అన్నారు. తాజా సమాచారం ప్రకారం సూరి-బన్నీల కాంబినేషన్ ఫైనల్ అయింది కానీ అది సీక్వెలా, కాదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇక మెగా క్యాంపులో టాప్ హీరోలతో వరుసగా సురేందర్ రెడ్డికి ఇది మూడో సినిమా అవుతుంది. చరణ్, చిరు, బన్నీలను వరుసగా డైరెక్ట్ చేసే అవకాశం రావడం అంటే జాక్‌పాట్ అనుకోవచ్చు. అయితే ‘సైరా’ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిస్తే మాత్రం సూరి-బన్నీ సినిమా క్రేజ్ ఆకాశాన్ని తాకుతుందనడంలో సందేహం లేదు.

Comments

comments