Home తాజా వార్తలు రానా కంటికి శస్త్రచికిత్స…

రానా కంటికి శస్త్రచికిత్స…

rana

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుపాటి రానా కంటి చికిత్స చేయించుకోనున్నారు. ఈ విషయాన్ని సురేష్ బాబు మీడియాకు వెల్లడించారు. కంటి చికిత్స కోసం రానా యుఎస్ వెళ్లనున్నాడు. దీంతో కొన్ని వారాలపాటు రానా షూటింగ్‌లకు విరామం ఇచ్చినట్లు సురేష్ బాబు తెలిపారు. తనకు కుడి కన్ను కనిపించదని రానా ఓ షోలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ కన్ను తీవ్రంగా నొప్పి పెడుతోందని, దీంతో శస్త్ర చికిత్స కోసం రానా విదేశాలకు వెళ్లనున్నట్లు సురేష్ బాబు తెలిపారు. రానాకు ఇప్పటివరకు డాక్టర్ సతీష్ గుప్తా మాక్సివిజన్‌లో శస్త్రచికిత్స చేశారని, ఇప్పుడు మాత్రం విదేశాల్లో చికిత్స చేయనున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రానా ‘హథీ మేరే సాథీ’, 1945 అనే చారిత్రక సినిమాలో నటిస్తున్నాడు.