Home తాజా వార్తలు వైమానిక దళానికి వందనం

వైమానిక దళానికి వందనం

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఎల్‌ఓసీని దాటి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాక్ ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. అత్యాధునిక మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఈ దాడుల్లో పాల్గొని మూడు ప్రాంతాల్లోని ఉగ్రవాదుల శిబిరాలను 21 నిమిషాల్లోనే సర్వనాశం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 300 మంది తీవ్రవాదులు హతమయ్యారని సమాచారం. పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు చేసిన పుల్వామా దాడికి ఇది సరైన ప్రతీకార చర్య అని భారతీయులు అందరూ అభిప్రాయపడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన వైమానిక దళానికి వందనం అంటున్నారు. ట్విట్టర్ ద్వారా పలువురు సినీ ప్రముఖులు తమ స్పందనను తెలియజేశారు. వీరంతా సోషల్ మీడియా ద్వారా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు మాట్లాడుతూ.. “మన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను చూసి నేను గర్విస్తున్నాను. భారత వాయుసేన వీరులైన పైలట్‌లకు వందనం”అని అన్నారు.

ప్రభాస్ మాట్లాడుతూ..“ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వీరత్వానికి వందనం… జైహింద్‌” అని చెప్పారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “పుల్వామా దాడులకు ప్రతీకారంగా మన దేశం సరైన సమాధానం ఇచ్చింది. ఇండియా స్ట్రైక్స్ బ్యాక్… భారత వాయుసేనకు వందనం… జైహింద్‌” అని తెలిపారు.

రామ్‌చరణ్ మాట్లాడుతూ.. “ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను చూసి నేను గర్విస్తున్నాను. జైహింద్… ఇండియా స్ట్రైక్స్ బ్యాక్‌”అని చెప్పారు.

బాలకృష్ణ మాట్లాడుతూ…“ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసిన ఈ ధైర్యం యావత్ భారతదేశానికి గర్వకారణం. మేరా భారత్ మహాన్… జైహింద్‌”అని తెలిపారు.

కమల్‌హాసన్ మాట్లాడుతూ..“పాకిస్తాన్ తీవ్రవాద క్యాంపులలో విధ్వంసం సృష్టించి భద్రంగా తిరిగివచ్చిన మన సైనికుల వీరత్వానికి వందనం. ఈ హీరోలను చూసి భారతదేశం గర్విస్తోంది”అని చెప్పారు.

కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ.. “చేతులు ముడుచుకుని కూర్చునే సమయం కాదని ప్రపంచానికి మనం నిరూపించాం. భారత వైమానిక దళానికి హృదయపూర్వక శుభాకాంక్షలు”అని అన్నారు.

అఖిల్ మాట్లాడుతూ..“సెల్యూట్ ఐఏఎఫ్. మన దేశానికి ఎంతో గర్వకారణమైన రోజు ఇది”అని పేర్కొన్నారు.

నితిన్ మాట్లాడుతూ.. “భారత వైమానిక దళానికి సెల్యూట్. జై హో… జైహింద్‌”అని చెప్పారు.

పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. “బుల్లెట్ దిగిందా లేదా… పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం”అని అన్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ..“జై హింద్… ఈ మెరుపు దాడులతో పాక్ తోకముడిచింది”అని చెప్పారు.

కోన వెంకట్ మాట్లాడుతూ..“మేం సమాధానం ఇస్తే సమాధులు కట్టుకోవదానికి మీకు శవాలు కూడా దొరకవు” అని అన్నారు. అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ..“భారత వైమానిక దళానికి మేం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం… జైహింద్‌”అని తెలిపారు. అక్షయ్‌కుమార్ మాట్లాడుతూ..“ఉగ్ర శిబిరాలను అంతమొందించిన మన భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడు తున్నాను” అని పేర్కొన్నారు.

అజయ్ దేవగణ్ మాట్లాడుతూ..“మాతో పెట్టుకుంటే ఇలాగే చచ్చిపోతారు. సెల్యూట్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌”అని చెప్పారు. అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ..“ప్రధానికి సెల్యూట్ చేయడం మొదలుపెట్టడానికి ఇదే మంచి రోజు”అని అన్నారు.

సమంత మాట్లాడుతూ..“ఉగ్ర దాడులు చేస్తే చివరికి వినాశనం ఇలాగే ఉంటుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు వందనం… జైహింద్‌”అని చెప్పారు.

రకుల్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..“ఇండియాస్ట్రైక్స్ బ్యాక్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడులను చూసి దేశమంతా గర్వపడుతోంది” అని తెలిపారు.

తమన్నా మాట్లాడుతూ.. “ఇండియన్ ఫోర్స్ ధైర్యానికి వందనం. ఐఏఎఫ్ దేశానికి గర్వకారణంగా నిలిచింది” అని అన్నారు.

Surgical Strike: Celebs Salute to Indian Air Force