Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

సర్జికల్‌ స్ట్రైక్స్‌ వీడియోలు నిజమే…

indian-army

న్యూఢిల్లీ: రెండు సంవత్సరాల కిందట ఇండియన్ ఆర్మీ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి పలువురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ సంఘటన అప్పట్లో దుమారం రేపింది. కాగా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి కొన్ని టివి ఛానళ్లలో ఆ వీడియోలు ప్రసారం అవుతున్నాయి. ఆ వీడియోలు అధికారిక వర్గాల తరుపునుంచే వారికి  అందినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీడియో ఫుటేజీలో డ్రోన్లు, మానవరహిత ఏరియల్‌ వెహికిల్స్‌ తో సైన్యం మెరుపు దాడులు జరిపినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. బంకర్లు, పలు మిలటరీ కట్టడాలు ధ్వంసమైనట్టు, కొందరు చనిపోతున్నట్టు వీడియోల్లో కనిపిస్తోంది. అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, ఆర్మీ చీఫ్‌ దల్బీర్ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌లు ఢిల్లీ నుంచి వీడియోలను పర్యవేక్షించారు.

అయితే ఆ వీడియోలు కాస్త ఇప్పుడు బయట పడ్డాయి.  భారత సైన్యం చేసిన మెరుపు దాడులను పాకిస్థాన్‌ అప్పట్లో తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ఆ వీడియోలు వాస్తవామేనని నార్తెర్న్‌ఆర్మీ మాజీ కమాండర్‌ రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డిఎస్‌ హూడా తెలిపారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ కథనంలో వెల్లడించింది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఆపరేషన్‌కు ఆయన చీఫ్ గా పనిచేశారు. ‘ఆ వీడియోలు నిజమేనని, తను ధ్రువీకరించగలనని తెలియజేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగిన సందర్భంలో తీసిన ఆ వీడియోలను అవసరమైనప్పుడు విడుదల చేయాలని అనుకున్నానని ఆయన పేర్కొన్నారు.కానీ ఆ వీడియోలు ఇప్పుడు బయటకు రామడం మంచిదే’ అని హూడా చెప్పారు. నాడు బిజెపి ప్రభుత్వంపైన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు విమర్శలు గుప్పించాయి.  మెరుపు దాడులు జరిగినట్టు సాక్ష్యం ఏంటానీ, వీడియోలు చూపించాలని నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే

 

Comments

comments