Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

దీపావళి కానుకగా..

suriya

గజిని, సింగం సిరీస్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో సూర్య 36వ చిత్రంగా ‘ఎన్‌జికె’ (నంద గోపాలకృష్ణ) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 7జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సూపర్‌హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీరాఘవ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభుల డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సోమవారం హీరో సూర్య పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ చిత్రం సెకండ్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సాయి పల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః శివకుమార్ విజయన్, సంగీతంః యువన్ శంకర్ రాజా, ఎడిటింగ్‌ః జి.కె.ప్రసన్న, ఆర్ట్‌ః ఆర్.కె.విజయ్ మురుగన్.

Comments

comments