Home ఆదిలాబాద్ పౌర సరఫరాలపై పహారా

పౌర సరఫరాలపై పహారా

అక్రమాలకు అడ్డుకట్ట

నకిలీల ఏరివేతకు రంగం సిద్ధం
ముమ్మర తనిఖీల కోసం ప్రత్యేక బృందాలు
ధరల నియంత్రణపై 

detectiveఆదిలాబాద్: జిల్లాలో లోపభూయిష్టంగా మారిన పౌర సరఫరాల వ్యవస్థను మెరుగు పరిచేం దుకు ప్రభుత్వం ఎట్టకేలకు రంగం లోకి దిగబోతోంది. గాడి తప్పిన పౌర సరఫరా వ్యవస్థను దారిలో పెట్టే లక్షంతో పలు చర్యలకు ఉపక్రమించబోతున్నారు. అక్రమాలు, అవకతవకలను పూర్తిగా నిరోధించడమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలను నిలకడగా ఉంచేందుకు చర్యలు చేపట్టబోతున్నారు. ముఖ్యం గా చౌక ధరల దుకాణాల్లో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట పడబోతోంది. చౌక దుకాణాల నుండి సబ్సిడి బియ్యం పెద్ద ఎత్తున దారి మల్లుతున్నట్లు అధికారుల తనిఖీల్లో నిర్ధారణ అయ్యింది,.

ఇటీవల పలు జిల్లాలో కోట్లాది రూపాయల విలువైన సబ్సిడి బియ్యం అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని అన్నీ జిల్లాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా చౌక దుకాణాలను నిరంతరంగా తనిఖీ చేయడమే కాకుండా హోల్ సేల్ కిరాణా అలాగే గిడ్డంగులపై విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించతలపెట్టారు. దీనికోసం గాను డివిజన్‌ల వారిగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయబోతున్నారు.

ఈ ప్రత్యేక బృందాలు ఇక నిరంతరంగా చౌక ధరల దుకాణాలనే కాకుండా హోల్ సేల్ కిరాణా దుకాణాలకు తనిఖీలు చేయబోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలను పూర్తి స్థాయిలో అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకోబోతున్నారు. అవతవకలకు పాల్పడే రేషన్ డీలర్లపైన అక్రమాలకు పాల్పడే వ్యాపారులపైన ఇక కఠిన శిక్షలు తీసుకోబోతున్నారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్న 6A సెక్షన్ కూడా సవరించి ఆ సెక్షన్‌కు మరింత పదును పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ప్రభుత్వం పౌర సరఫరాలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆ శాఖను గాడిలో పెట్టెందుకు తోడ్పడబోనున్నాయంటున్నారు.