Home నిర్మల్ సర్వే నెంబర్ 140 భూములను పేదలకివ్వాలి

సర్వే నెంబర్ 140 భూములను పేదలకివ్వాలి

DARNA

అక్రమ కేసులను బేషరతులగా ఎత్తివేయాలి 

కడెం ఉపకాలువ నుండి సాగునీరు అందించాలని డిమాండ్

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో బుట్టాపూర్ గ్రామ పరిధిలో గల సర్వే నం 140 భూములను  పేదలకు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిసంఘం ఆధ్వర్యంలో సోమవారం బుట్టాపూర్ గ్రామస్తులు స్థానిక అటవీశాఖ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీని నిర్వహించారు. కలెక్టరేట్ ముట్టడించి ఆందోళన చేశారు. వీరిని పోలీస్ సిబ్బంది కార్యాలయం లోపటికి వెళ్లకుండా అడ్డకున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతీరేకంగా నినాదాలు చేశారు. అ నంతరం ఎఒ కిరణమ్మయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దు ర్గం నూతన్ కుమర్ మాట్లాడారు. దస్తురాబాద్ మండంలోని బుట్టాపూర్ గ్రామంలో సుమారు 1500 ఎకరాల భూమి ఉందన్నారు. 1960లో భూమిని పేదలకు ఇవ్వాలని భూపోరాటలు చే శామన్నారు. నాడు పోరాటలు చేసిన 50 మం దికి పైగా అక్రమకేసులు విధించారన్నారు. అలా గే  ఈ భూములకు కడెం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందాల్సి ఉండగా భూములను సాగు చే యకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకొని నో టీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే కడెం ప్రాజెక్టు కా లువ 8వ నెంబర్ ఉప కాలువలను తెరువకుండా, సాగునీరు అందించకుండా అటవీ అధికారులు అడ్డుకొని నోటిటీసులు ఇవ్వ డం జరిగిందన్నారు. వెంటనే ఈ భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. 8వ నెంబర్ ఉపకాలువ ద్వారా నీటిని అందిచాలన్నారు. సెక్షన్ 4 కింద భూములను పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. అక్రమంగా మోపిన కేసులకు ఎత్తివేయాలన్నారు. అటవీశాఖ ఇచ్చి న నోటీసులను వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. హరితహారం పేరుతో ప్రభుత్వం పేదల నుండి భూములను లాక్కొనే కుట్రను విరమించాలన్నారు. లేనిపక్షంలో మరో భూపోరాటలను చేస్తామని హెచ్చరించారు. టి-మాస్ జిల్లా కన్వీనర్ కిషన్‌కుమార్, సీసీఎం జిల్లా కమిటీ సభ్యులు డి.పోశెట్టి, సిసిఐ జిల్లా  కార్యదర్శి ఎస్‌ఎస్‌రెడ్డి,శంకర్, మహిముద్, గంగన్న, బుట్టపూర్ గ్రామ భూపోరాటల కమిటీ అధ్యక్షురాలు మగ్గిడి పుష్పలత, ఉపాధ్యక్షురాలు రమ, కిష్ణ, బొమ్మెన నరేష్, శై లేందర్, బి.లక్ష్మిరాజ్యం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.