Search
Sunday 23 September 2018
  • :
  • :

భారీ కుంభకోణంలో బిహార్ సిఎం..!

tejaswin
పాట్నా: శ్రీజన్ కుంభకోణంలో బిహార్ సిఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సిఎం సుశీల్ మోడీల పాత్ర ఉందని ఆర్‌జెడి నేత  తేజస్వీ యాదవ్ తీవ్రంగా ఆరోపించారు. తన ఆరోపణలకు సాక్ష్యంగా శ్రీజన్ బ్యాంక్ స్టేట్‌మెంట్లను చూపించారు. సుశీల్ మోడీ సోదరి రేఖ, మేనకోడలు ఊర్వశి శ్రీజన్ కుంభకోణంలో కోట్లల్లో లబ్దిపొందినట్టు చెప్పారు. శ్రీజన్ స్కాం రూ. 2,500 కోట్లకు సంబంధించినదని తెలియజేశారు. సిబిఐ వీళ్లను ఎందుకు విచారించదని తేజస్వీ ప్రశ్నించారు. అయితే సుశీల్ మోడీ ఇటీవలే ఓ మీడియా సమావేశంలో స్పందిస్తూ… తేజస్వీపైన తీవ్ర అవినీతి ఆరోపణలను గుప్పించారు. దేశంలోనే ప్రముఖ స్టీల్ కంపెనీ స్టోరేజీ ఏజెంట్‌గా ఉన్నారని తెలిపారు.  కానీ ఈ విషయాన్ని 2015లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఆదాయం చూపించకుండా పన్నులు ఎగ్గోడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా తేజస్వీ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. అసత్యాలను ప్రచారం చేయడంలో డిప్యూటి సిఎం దిట్ట  అన్నారు. అంతేకాకుండా విచారణ చేసి నిరూపించాల్సిందిగా తేజస్వీ యాదవ్, సుశీల్ మోడీకి సవాల్ విసిరారు.
image

Comments

comments