Home అంతర్జాతీయ వార్తలు వారిని ఆదుకుంటాం : సుష్మా

వారిని ఆదుకుంటాం : సుష్మా

sushma_manatelanganaఢిల్లీ : పాకిస్థాన్‌లో ఉండే హిందువులను ఆదుకుంటామని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. పాక్‌లో హిందువులు వివాహ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని పంజాబ్ ఎంపి అవినాశ్ రాయ్‌ఖన్నా రాజ్యసభలో వెల్లడించారు. దీనిపై సుష్మా స్పందించారు. పాక్‌లోని హిందువుల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని ఆమె వెల్లడించారు. పాక్‌లోని మైనార్టీలు, హిందువుల సమస్యలపై ఇప్పటికే ఆ దేశ ప్రతినిధులతో చర్చించినట్టు ఆమె తెలిపారు.