Home సినిమా వచ్చే ఏడాది సుస్మిత పెళ్లి?

వచ్చే ఏడాది సుస్మిత పెళ్లి?

Sushmita-Senబాలీవుడ్ స్టార్ బ్యూటీలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకునేలు పెళ్లికి సిద్ధమయ్యారు. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను ప్రియాంక పెళ్లి చేసుకోనుండగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌ను దీపిక వివాహమాడనుంది. ఈ బ్యూటీల పెళ్లికి సంబంధించిన వార్తలు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక మాజీ విశ్వసుందరి, సినీ తార సుస్మితా సేన్ కూడా పెళ్లి పీటలెక్కనుందని తెలిసింది. ఈ 42 ఏళ్ల సుందరి పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకొని తల్లయింది. కానీ ఈ భామ ఇటీవల తనకంటే 15 ఏళ్ల చిన్నవాడైన మోడల్ రోహ్‌మన్ షాల్‌తో ప్రేమలో పడిపోయింది. ప్రస్తుతం వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈమధ్య సుస్మిత, రోహ్‌మన్ కలిసి పలు పార్టీలకు హాజరవుతున్నారు. అయితే తాజాగా సుస్మిత తన బాయ్‌ఫ్రెండ్ రోహ్‌మన్, తన పిల్లలు, తాను కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ‘దుగ్గాదుగ్గా’ అనే క్యాప్షన్ ఇచ్చింది. గాఢమైన ప్రేమలో మునిగితేలుతున్న సుస్మిత, రోహ్‌మన్‌లు వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే అవకాశం ఉందని సమాచారం.

Sushmita Sen to get Married to Rohman next Year 

Telangana News