Home అంతర్జాతీయ వార్తలు వైమానిక దాడిలో 54 మంది మృతి…

వైమానిక దాడిలో 54 మంది మృతి…

Suspected Airstrike in Syria kills at least 54 people

డీర్ ఇజార్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉంటున్న స్థావరాలపై జరిగిన వైమానిక దాడుల్లో సుమారు 54 మంది పౌరులు మృతి చెందిన ఘటన సిరియాలోని డీర్ ఇజార్‌లో శుక్రవారం జరిగింది. ఇరాక్ బోర్డర్ సమీపంలో ఉన్న అల్ సౌసా గ్రామంలో ఉన్న ఐస్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న పౌరులపై వైమానిక దాడి జరిగినట్లు సిరియా అబ్జర్వేటరీ వెల్లడించింది. అయితే దాడులు చేసింది ఇరాకీ విమానాలా లేక అమెరికా సంకీర్ణ దళాలా అనేది తెలియాల్సి ఉందన్నారు సిరియా భద్రతాధికారులు.