Search
Friday 21 September 2018
  • :
  • :

గేదెల దొంగతనం నెపంతో వ్యక్తి హత్య..!

Suspected buffalo thief lynched by locals in Haryana

చంఢీగఢ్: గేదెలను దొంగలిస్తున్నాడనే నెపంతో స్థానికులు ఓ వ్యక్తిని కొట్టి చంపేసిన దారుణ ఘటన హర్యానా రాష్ట్రంలోని బెహ్రోలా గ్రామంలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి గేదెలను దొంగలిస్తున్నాడనే అనుమానంతో గ్రామస్థులు అతడిపై కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడి చనిపోయాడు. కాగా, అతడితో వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. సమాచాంరం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. అనంతరం ఈ దాడికి సంబంధించి ముగ్గురు సోదరులపై కేసు నమోదు చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments