Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

శంషాబాద్ విమానాశ్రయంలో వ్యక్తి హల్‌చల్

Rajiv-Gandhi-International-హైదరాబాద్: నగరంలోని శంషాబాద్‌లో గల రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి బుధవారం హల్‌చల్ చేశాడు. ఒమన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మస్కట్ నుంచి వచ్చిన సదరు వ్యక్తి రన్‌వే వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా సిఐఎస్‌ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం విమానాశ్రయం సిబ్బందికి అప్పగించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అతడికి మతిస్థిమితం లేదని తేల్చారు. పట్టుబడిన వ్యక్తిని కరీంనగర్ జిల్లా వాసిగా గుర్తించి, వదిలేశారు.

Comments

comments