Search
Thursday 15 November 2018
  • :
  • :

కోహ్లితో మాట్లాడాకే చెబుతాం!

 గంగూలీ స్పష్టీకరణ

టీమిండియా ప్రధాన కోచ్ పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్

GUNGULYముంబయి: టీమిండియా ప్రధాన కోచ్ పదవిపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కోచ్‌గా ఎవరిని ఎంపిక చేయాలనేది భారత జట్టు కెప్టన్ విరాట్ కోహ్లితో మాట్లాడిన తర్వాతే ప్రకటిస్తామని సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. సోమవారం సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సిఎసి) ముంబయిలోని బిసిసిఐ ప్రధాన కార్యాలయంలో ఆరుగురితో ఇంటర్వూలు నిర్వహించిం ది. అనంతరం గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా కోహ్లితో మాట్లాడిన తరువాతే కోచ్ ఎవరూ అనేది అతని సూచనల మేరకు ప్రకటిస్తా మన్నారు. ‘ప్రస్తుతం విరాట్ విదేశీ పర్యటనలో ఉన్నాడు. అతడు తిరిగివ చ్చాక కోచ్ ఎంపికపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పాడు. అప్పటివరకూ టీమిండియా కోచ్ ఎంపిక ప్రకటనను ఆపివేస్తునట్టు గంగూలీ తెలిపారు. ‘అమెరికా నుంచి ముందు కోహ్లిని రానివ్వండి. కోచ్ ఎంపికకు తొందరేమీ లేదు. దానికి మరింత సమయం అవసరం. కోచ్ ఎంపిక విషయంలో కోహ్లి ఇప్పటివర కూ ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. విరాట్‌తో మాట్లాడిన తర్వాతే సిఎసి ఒక నిర్ణయానికి వస్తుంది. ప్రస్తుతం శ్రీలంక పర్యటన లక్షం కాదు. దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. అప్పుడే కోచ్ ఎంపిక ప్రక్రియ ముగుస్తుంది. కోహ్లికే ఆ గౌరవం దక్కాలి’ అని గంగూలీ పేర్కొన్నా రు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి కోచ్ లేకుండానే టీమిండియా కొనసాగనుంది.

Comments

comments