Home జోగులాంబ గద్వాల్ గద్వాల ఎఎస్‌ఐ హసన్ పై సస్పెన్షన్ వేటు

గద్వాల ఎఎస్‌ఐ హసన్ పై సస్పెన్షన్ వేటు

Woman-Homeguard-Massage-to-

గద్వాల : పోలీసు కార్యాలయాన్నే మసాజ్ సెంటర్‌గా ఏర్పాటు చేసుకుని ఎఆర్ శాఖలోని ఎఎస్‌ఐ మహిళా హోంగార్డుతో సేవలు చేయించుకుంటున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో సోమవారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు గద్వాల్ ఏఆర్  ఎఎస్‌ఐ హసన్ పై సస్పైన్షన్ వేటు వేశారు. మహిళ హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న ఏఎస్సై హసన్ మసాజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఏఎస్సై హసన్ సస్పెండ్ చేస్తూ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.