Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

విధులకు గైర్హాజరైతే సస్పెన్షన్ తప్పదు

Officer

పిహెచ్‌సి వైద్యాధికారి, హెల్త్ సూపర్‌వైజర్లు గైర్హాజరు
కట్టంగూర్ ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ పర్యటన
తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
ప్రభుత్వ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల పరిశీలన

కట్టంగూర్: జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు సమ య పాలన పాటించకుండా, విధులకు గైర్హాజరైతే సస్పెన్షన్ వేటు తప్పదని నల్లగొండ జిల్లా కలెక్టర్ డా॥ గౌరవ్ ఉప్పల్ హెచ్చరించారు. సోమవారం రాఖీ పండుగ కావడంతో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు ఎంపిడివో, తహశీల్దార్ కార్యాలయాలను అకస్మికంగా తనిఖీ చేసారు. అనంతరం హాజరుపట్టికను, ఓపి రిజిస్టర్‌ను పరిశీ లించారు. ఈ సందర్భంగా ప్ర భుత్వ దవా ఖానాలో కలెక్టర్ సందర్శించిన సమయంలో ప్రభుత్వ వైద్యాధికారి డా॥ వేణుగో పాల్‌రెడ్డి, హెల్త్ సూపర్‌వైజర్ రామలింగయ్యలు గైర్హా జరు అయినట్లు గుర్తించి, వైద్య సిబ్బందిపై  ఆగ్రహం వ్యక్తం చేసారు.

అనంతరం జిల్లా వై ద్య ఆరోగ్యశాఖ అధికారి భాను ప్రకా ష్ నాయ క్‌కు వెంటనే ఫోన్ చేసి, కట్టంగూర్ వై ద్యాధికారి మీకు ఏమైనా సమాచారం ఇచ్చాడా, అని అడగగా, తనకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా  వైద్యాధికారి కలెక్టర్‌కు తెలిపారు. మీరు జిల్లా లోని ప్రభుత్వ ఆసు పత్రులను తనిఖీ చేసి, వైద్య సేవలు ఏవిధంగా అందుతున్నాయో తెలుసుకో వాలని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురా వాలని కలెక్టర్ డిఎమ్‌హెచ్‌వోను ఆదేశించారు.  ప్ర భు త్వ వైద్యాధికారి డా॥ వేణుగోపాల్ రెడ్డి, హెల్త్ సూపర్‌వైజర్ రామలింగయ్యలు విధులకు గైర్హాజరయ్యారని, వీరిని వెంటనే నాదగ్గరకు పంపించాలని జిల్లా వైద్యాధి కారికి సూచించారు.

అనంతరం రోజుకు ఎంత మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నా రు, పాము, తేలు, కుక్కకాటుకు మందులు అ ందుబాటులో ఉన్నాయా, నెలకు సగటున ఎంత మంది పేషేంట్లు ఆసుపత్రికి వస్తున్నారు, ప్రభుత్వ పథకాలు పేదప్రజలకు సక్రమంగా అందిస్తున్నారా, అని వైద్య సిబ్బందిపై ప్రశ్నల సిబ్బంది కురిపించారు. ఈరోజు ఎంతమంది పేషెంట్లు వచ్చారని స్టాఫ్ నర్స్ జాస్మిన్‌ను  అడుగగా 25మంది వచ్చారని, ఓపి ఎవరు చూసారని ప్రశ్నించగా, నేనే చూసానని స్టాఫ్ నర్స్ తెలపడంతో మీరే డాక్టరయ్యారా, అని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా, ప్రజలకు అందుబాటులో ఉండి, సరైన సమాధానం చెప్పాలని కోరారు.

జిల్లాలో పలు కార్యాలయాల్లో ఉద్యోగస్తులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో నూతనంగా పదవీబాద్యతలు స్వీకరించిన తహశీల్దార్ తిరందాస్ వెంకటేశంతో రెవిన్యూ రికార్డులపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రెవిన్యూ రికార్డుల సవరణకోసం ప్యూరిఫికేషన్ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుందని, రెవిన్యూ సిబ్బంది త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. చిట్యాల మండల విద్యాధికారి కట్టంగూర్ మండల విద్యాధికారిగా పనిచేస్తున్నారని, గత 5 రోజులుగా విధులకు హాజరుకావడం లేదని తన పరిశీలనలో తేలిందని, ఈవిషయంపై డీఇవోకు ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఆయన వెంట తహశీల్దార్ తిరందాసు వెంకటేశం, నాయబ్ తహశీల్దార్ కె. వెంకటరమణ, గిర్దావార్ జానీషరీఫ్, వైద్య సిబ్బంది జాస్మిన్, ఆనంద్, జితేందర్‌రెడ్డి, ఏపివో రామ్మోహన్‌లు ఉన్నారు.

Comments

comments