Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

లండన్‌లో వరంగల్ వివాహిత స్వాతి అనుమానాస్పద మృతి

Swathi

వరంగల్ క్రైం: వరంగల్‌కు చెం దిన స్వాతి అనే వివాహిత లండన్‌లో హఠాత్తుగా మరణించడం అనుమానానికి దారి తీస్తోంది. కట్నం చాలదని అత్తింటివారే చంపారంటూ మృ తురాలి కుటుంబసభ్యులు, బంధువులు హన్మకొండలోని భర్త ఇంటిముందు ఆందోళనకు దిగారు. హన్మకొండలోని అడ్వకేట్స్ కాలనీకి చెందిన స్వామినాథన్, భారతి దంపతుల కుమార్తె స్వాతిని ఆ ఊరికే చెందిన శ్రీపతి శ్రీనివాస్ కుమారుడు రాజేశ్‌కు ఇచ్చి 2016లో వివాహం జరిపించారు. పెళ్లైన కొద్ది రోజులలో రాజేశ్‌కు లండన్‌లో ఉద్యో గం రావడంతో భార్యను తీసుకొని వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని మృతురాలి బంధువులు చెబుతున్నారు. అక్టోబర్ 2న తమ కూతురు ఫోన్ చేసి భర్త, అత్తమామలు తనను తీవ్రంగా వేధిస్తున్నారని చెప్పినట్లు తండ్రి స్వామినాథన్ తెలిపారు. బుధవారం రాత్రి రాజేశ్ ఫోన్ చేసి స్వాతి చనిపోయిందని చెప్పాడని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అదనపు కట్నం కోసమే తమ కూతురిని పొట్టను పెట్టుకున్నారని స్వాతి బంధువులు ఆరోపిస్తూ రాజేశ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్వాతి మృతదేహాన్ని త్వరగా స్వస్థలానికి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Comments

comments