Home జాతీయ వార్తలు బాలిక నోట్లో సుతిలి బాంబు పెట్టి….

బాలిక నోట్లో సుతిలి బాంబు పెట్టి….

Police

లక్నో: దీపావళి సందర్భంగా  బాలిక నోట్లో బాంబు పేల్చిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లా దూరాలా ప్రాంతం మీలాక్ గ్రామంలో జరిగింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. హర్ పాల్ (17) అనే యువకుడు మూడేండ్ల బాలికను బాంబులు కొనిస్తానని తీసుకెళ్లాడు. సదరు బాలిక నోట్లో సుతిలి బాంబు పెట్టి ముట్టించాడు. దీంతో బాలిక నోట్లో బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడింది. నోటి నుంచి రక్తం కారుతుండడంతో బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి సుశీల్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని నోటి పైభాగం, గొంతులో 50 కుట్లు వేశామని వైద్యులు వెల్లడించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాలిక బంధువులు, స్థానికులు ఆందోళన చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Sutli Bomb Blast in Girl Mouth Set off by Boy  

Telangana news