Home కరీంనగర్ అనాథ శవానికి అంత్యక్రియలు

అనాథ శవానికి అంత్యక్రియలు

Swachanda seva organization organized funeral for orphanage
కరీంనగర్: ప్రగతి రూరల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అనే స్వచ్చంధ సంస్థ వారు ఓ ఆనాధ మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తిరుపతమ్మ అనే కుష్ఠు వ్యాధిగ్రస్తురాలిని సంస్థ నిర్వాహకులు ఇటీవల సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు ఎవరులేరని ఆనాధ అని తెలిసిన తరువాత ఆర్గనైజేషన్‌కు చెందిన ఓ వాలెంటర్‌ను ఆమెకు రక్షణగా దవాఖానలో ఉంచి వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో సిరిసిల్ల ఆసుపత్రి నుండి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు కావలసిన దుస్తులు, డ్రెస్సింగ్ తదితర సౌకర్యాలను సంస్థ నుండి కల్పించడం జరిగిందని సంస్థ నిర్వాహకులైన కె.వెంకటయ్య, శృతి సోషియేబుల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు నీర్ల శ్రీనివాస్‌లు తెలిపారు. తిరుపతమ్మ మృతి చెందడంతో కరీంనగర్ నగర పాలక సంస్థ కమీషనర్ శశాంక అనుమతితో దహన సంస్కారాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు మౌనిక, మంజుల, మాధురి, సృజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.