Search
Wednesday 14 November 2018
  • :
  • :

మూలకు స్వచ్ఛ రిక్షా

Rikshaw

అశ్వారావుపేట : స్వఛ్చ తెలంగాణ కోసం తెలంగాణ ప్రభుత్వం ముందు వెనుక చూడకుండా కోట్ల రూపాయలను ఖర్చు చేసి చేత్త రిక్షాలను కొనుగోలు చేసింది. గ్రామ పంచాయతీలకు రిక్షాలను అప్పగించి చేతులు దులుపుకుంది. ఇప్పటికే పంచాయతీలకు నిధులు కోరతతో ప్రస్తుతం ఉన్న సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్ధితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇదీ చాలదన్నట్టు రిక్షాలు ఇవ్వటంతో వాటి నిర్వహణకునిధులు కేటాయించకపోటంతో రిక్షాలను మూలనపడేసారు. నిధుల కోరతతో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు స్వచ్చ రిక్షాలు పంచాయతీ పట్ల శరాఘాతంగా పరిణమించాయి.

ప్రభుత్వ నిర్ణయంతో పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.గ్రామ పంచాయతీలపై ఇప్పటికే విద్యుత్ బిల్లుల భారం
పడింది. స్వచ్చ భారత రిక్షాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరి చేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. రూ,6 కోట్లతో 12,500ల రిక్షాలు కొనుగోలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 205 పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌లకు స్వచ్చ తెలంగాణలో బాగంగా సుమారు రూ. 6 కోట్ల
రూపాయలు విలువ చేసే 12,500ల మూడు చక్రాల రిక్షాలను అందజేసారు.

ఒక్కో రిక్షా విలువ రూ.50వేలు ఉంటుంది. క్షేత్ర స్ధాయిలో స్వచ్చ రిక్షాలు ఎంత వరకు ఉపయోగపడుతాయే అనే లేకుండా వేల సంఖ్యలో రిక్షాలను కొనుగోలు చేసి పంచాయతీలకు ప్రభుత్వం సరఫరా చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది.  ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు రిక్షాల వినియోగం పెద్ద బారంగా మారింది. ఈ రిక్షాలను వినియోగించకుండానే పంచాయతీ కార్యాలయాల్లో మూలనపడేసారు.

నైపుణ్యం ఉన్న కార్మికులు లేరు…
మూడు చక్రాల రిక్షాలను లాక్కుని వెళ్ళే నైపుణ్యం ఉన్న కార్మికులు ఎవ్వరూ లేరు. ఒక్కో రిక్షాల్లోకి డ్రైన్‌లో మట్టి, బురద, చెత్తకుప్పలను ఎత్తాలంటే కనీసం ముగ్గురు మనుషులు కావాలి. ఒక్కోమేజర్ పంచా యతీకి 15 రిక్షాలు కేటాయించారు. వాటిని రోజు నిర్వహిం చాలంటే రోజుకు 45 మంది కార్మికులు కావాలి.అదనపు ఖర్చు పంచాయతీలకు మోయలేని భారంగా మారింది.

చిన్న పంచాయతీలో సిబ్బందే అంతంత మాత్రం. తాగు నీటి మోటర్లు వదిలే ఆపరేటర్లకు జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. ఇటీవల పంచాయతీలకు అదనంగా విద్యుత బిల్లులు చెల్లింపు భారాన్ని మోపారు. గ్రామాల అభివృధ్ధికి నిధులు లేకుండా పోయాయి. ఇటువంటి పరిస్థితిలో స్వచ్చ తెలంగాణ రిక్షాల నిర్వహణ గ్రామ పంచా యతీలకు శక్తికి మించిన భారమే.గ్రామ పంచాయతీల పరిదిలోని గ్రామాల్లో చెత్తను ఈ రిక్షాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించాల్సివుంది. వీటి నిర్వహణతోపాటు రిక్షా కూలీ జీత భత్యాలను పంచాయతీలే భర్చించాల్సి వుంది. పంచాయతీలకు ఎటువంటి ఆదాయం వచ్చే వనరులు లేకపోవటం, నిధులు లేకపోవటంతో రిక్షాలను ఎలా నిర్వహించాల్లో తెలియక సర్పంచ్‌లు, కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నా

Comments

comments